నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు సప్తసముద్రాలలో దాక్కున్నా .. వెతికి వెతికి మరీ ఎక్కడున్నా దారుణాలు చేసిన అధికారులు, నేతలను లాక్కొస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు. టీడీపీ అధికారిక వెబ్‌సైట్లో చేసేవన్నీ ఫేక్ పోస్టులేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మీడియాతో ప్రస్తావించారు. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్ సైట్‌లో ఓ పోస్ట్ చేశారు. దానికి కారు టైర్ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు. స్వయంగా విజయమ్మే ఇది ఫేక్ న్యూస్ అని లేఖ ఇచ్చారు. కానీ, ఆ లేఖ కూడా ఫేక్ అని ప్రచారం చేశారు. చివరకు.. అదంతా అబద్ధమని విజయమ్మ టీవీ ముందుకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లోనే జరిగింది. మరి నారా లోకేష్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?. ఇంతకుమించి దిగజారిపోయి.. దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.
నా భార్య(వైఎస్ భారతి) కడప పోలీస్ అధికారితో ఫోన్‌లో మాట్లాడిందని ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ఇచ్చింది. అది ఫేక్ కథనం. అలాంటప్పుడు రాధాకృష్ణను జైల్లో పెడతారా?. ఎల్లో మీడియా అలానే ఉంది.. సోషల్ మీడియా అలానే ఉంది అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్న వైఎస్సార్‌సీపీ యాక్టివిస్టుల అరెస్టుల పర్వంపై గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అఘాయిత్యాలపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. మద్యం మాఫియాపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. కరెంట్ ఛార్జీలపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. వరద సాయంపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. ఉచిత ఇసుకపై ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తున్నారని అన్నందుకు.. తప్పుడు కేసు. అసలు జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు?.
మీరు చూస్తే మేం చూస్తూ ఊరుకోమని జగన్ హెచ్చరించారు. ప్రతీ పోలీస్ మీద ప్రైవేట్ కంప్లైట్ పెట్టుకుంటామని.. బాధితుల పక్షాన వైసీపీ లీగల్ ఫైట్ చేస్తుందని జగన్ హెచ్చరించారు.
Police vallaki chepthunna Meeru ilane chesthe mathram mem kuda private ga courts ki veltham…
Inka kavali ante meme personal ga fund chestham 🔥🔥🔥 — @ysjagan pic.twitter.com/6KybxCpRbh— Arjun Reddy (@ARJUNSSMB0223) November 7, 2024
https://x.com/ARJUNSSMB0223/status/1854478530106585470
https://x.com/saiholicc/status/1854478900438728884
https://x.com/2024YCP/status/1854473638348550325
https://x.com/greatandhranews/status/1854468464733573338