YS Jagan : నేనే వచ్చి ధర్నా చేస్తా : వైఎస్ జగన్

YS Jagan assured the victims of Achyutapuram that he will come and hold a dharna

YS Jagan : అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఘటన గురించి ఎక్కువ స్పందించకూడదు అనే తాపత్రయం కనపడిందని ఆరోపించారు. 17 మంది చనిపోతే సాయంత్రం 4 గంటలకు హోం మంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సహాయచర్యలను పర్యవేక్షించడానికి అనకాపల్లి వెళ్తున్న అనేమాట మాట్లాడలేదు.. ఇంకో గంట తరువాత కార్మికశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో వివరాలు లేవు అని మాట్లాడాడు.. అంత పెద్ద ఘటన జరిగితే ఘటనా స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయారు? అధికారులు ఎప్పుడు పోయారు? కమిషనర్ ఎప్పుడు పోయారు అనేది చూస్తే చాలా బాధ కలుగుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్జీ పాలిమర్స్ బాధితులకి వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో కోటి రూపాయలు పరిహారం. అదే తరహాలో అచ్యుతాపురం ప్రమాద బాధితులకి ఇవ్వాలని డిమాండ్ చేసిన వైయస్ జగన్.. దీనికి ప్రభుత్వం కూడా డిమాండ్‌కి తలొగ్గి అచ్యుతాపురం ప్రమాద బాధితులకి కోటి రూపాయల పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. ప్రమాద బాధితులని ఈరోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన వైయస్ జగన్ గారికి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

బాధితులకు అందుతున్న వైద్యం, వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరాతీసి.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మీకు పరిహారం రాకుంటే నేనే స్వయంగా వచ్చి ధర్నా చేస్తానంటూ జగన్ బాధితుల పక్షాల నిలబడి వారికి స్వయంగా ఆస్పత్రి బెడ్ పై హామీనివ్వడం విశేషం. . జగన్ నే ధర్నా చేస్తానని ప్రకటించడంతో దెబ్బకు దిగివచ్చి రూ.కోటి పరిహారం ఇస్తానని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.