YCP vs TDP : బంతిని గోడకు ఎంత బలంగా కొడితే అంతే బలంగా అది నిన్ను కొడుతుంది. అదే ప్రకృతి ధర్మం.. ఇప్పుడు అధికార మదంతో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలపై పడిపోతున్నారు. హత్యలు, దాడులతో బంబేలెత్తిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్ ఇప్పటికే ఒక హెచ్చరికలు చేశాడు. దాడులకు ప్రతిదాడులు తప్పవని.. అధికారం మారితే మీ పరిస్థితి ఇలానే ఉంటుందని హెచ్చరించారు.
వైఎస్ జగన్ అన్నట్టే జరుగుతోంది. టీడీపీ మూకల దాడుల నుంచి వైసీపీ నేతలను కాపాడుకునేందుకే ప్రజలే ముందుకు వస్తున్నారు. వైసీపీ నేతలకు అండగా అరాచకవాదుల పీచమణుస్తున్నారు. చూస్తుంటే తిరుగుబాటు మొదలయ్యిందని అనిపిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం లో వైసీపీ సర్పంచ్ పై దాడికి ప్రయత్నించిన తెలుగు దేశం కూటమి వర్గాన్ని గ్రామస్థులు ఎదురించారు. ఏకంగా టీడీపీ నేతలకు దేహశుద్ధి చేసి గ్రామస్తులు తగిన బుద్ది చెప్పారు.
వైసీపీ నేతల తరుఫున ప్రజలే ముందుకొచ్చి వారికి అండగా నిలవడం జనంలో వచ్చిన మార్పునకు నిదర్శనం. టీడీపీ అరాచకాలపై ప్రజల్లోనే ఈ తిరుగుబాటు రావడం ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఈ మార్పు టీడీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడం తథ్యం అని అంటున్నారు.
మా నుంచి కూడా ప్రతి దాడులు ప్రారంభించాం 🔥
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం లో వైసిపి సర్పంచ్ పై టిడిపి వారు దాడిచేయబోగా!!
గ్రామస్థులు అందరూ ఎదురు దాడి చేసి నిందితులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. pic.twitter.com/Qhg0mBMdgK
— YSRCP Brigade (@YSRCPBrigade) August 7, 2024