‘ముందుగ మురిస్తే పండుగ కాదని చంద్రబాబుకు అర్థమైంది’.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు. ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరిపోతోంది. విచ్చలవిడిగా పెరుగుతున్న దాడులు, కూటమి నాయకులు చేస్తున్న దందాలతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఒకవైపు కూటమి నాయకులు దందాలు సాగిస్తుంటే.. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వెరసి ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న అసహనం కట్టలు తెంచుకొని బయటకు వస్తోంది. దీంతో ప్రజలే రోడ్డుపైకి వచ్చే పరిస్థితి నెలకొంది.
తాజాగా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ నిర్వహించిన ర్యాలీని చూస్తే ఎవరికైనా కూటమి ప్రభుత్వంపై ఈ స్థాయిలో ప్రజల్లో అసంతృప్తి ఉందా అని అనిపించక మానదు. ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నర్సీపట్నంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ శ్రేణులతోపాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉచిత ఇసుక పేరుతో టన్నుకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇసుక తక్కువ రేటుకు తాము అందిస్తే జే టాక్స్ అని విమర్శించిన అయ్యన్నపాత్రుడు, ఇప్పుడు సిబిఎన్ టాక్స్ వసూలు చేస్తున్నారా.? చింతకాయల అయ్యన్నపాత్రుడు టాక్స్ కట్టిస్తున్నారా.? అని నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో భారీగా నిల్వ ఉన్న ఇసుక ప్రస్తుతం లేకుండా పోయిందని, ఆ ఇసుక ఎటు వెళుతోందని ప్రశ్నించారు. ఏడు కోట్ల రూపాయల విలువచేసే ఇసుక ఎవరికి వెళ్ళిందని ప్రశ్నించారు. ట్రాన్స్ పోర్ట్ కు కాకుండా రూ.6,500పైగా ఒక ట్రాక్టర్ ఇసుకకు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడవకముందే ఈ స్థాయిలో ర్యాలీ జరగడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత లేకపోతే నర్సీపట్నం లాంటి నియోజకవర్గంలో వేలాది సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వస్తారంటూ పలువురు పేర్కొంటున్నారు. ప్రజా ఆగ్రహం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు తప్పించుకోలేరు అనడానికి తాజాగా నర్సీపట్నంలో చేపట్టిన ర్యాలీ ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు.
గత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలను చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఈ హామీలను అమలు చేస్తారని ఆశగా ఎంతోమంది చూస్తున్నారు. ఒకవేళ అమలు చేయరు అన్న నిర్ణయానికి ప్రజలు వస్తే మాత్రం వారి ఆగ్రహానికి గురికావాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఎదురవుతుంది. ఇప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న ఎంతోమంది లబ్ధిదారులు రోడ్డు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో వెనక్కి తగ్గుతున్నారు. కొద్దిరోజుల్లో కొత్త పెన్షన్లు కలపాల్సి ఉంటుంది. తొమ్మిది నెలలుగా అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు. అటువంటి వారంతా రోడ్డు ఎక్కే పరిస్థితి నెలకొననుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు దాని గురించి ఆలోచించలేదు. దీపావళికి ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. దీపావళికి ఈ పథకాన్ని అమలు చేయకపోతే మాత్రం మహిళా మణులు చీపుర్లు తీసే అవకాశం ఉంది.
ఫ్రీ బస్సు విషయాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. కూటమి అధికారంలోకి రావడంలో కీలకంగా మారిన ఈ హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారో అని ఇప్పటికే బస్సు ఎక్కిన ప్రతి మహిళ డ్రైవర్, కండక్టర్ ను అడుగుతూనే ఉంది. ఒకవేళ ప్రభుత్వం జాప్యం చేస్తే మాత్రం బస్సుల్లో గొడవలకు ఆస్కారం ఉంటుందని పలువురు చెబుతున్నారు. అమ్మకు వందనాన్ని ఈ ఏడాది అటకెక్కించిన ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తుందో కూడా తెలియడం లేదు. దీనిపైన పలువురు తల్లులు గుర్రుగా ఉన్నారు. రైతు భరోసా ఇవ్వకపోవడంతో ఎంతోమంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఏ క్షణమైనా ప్రభుత్వ కార్యాలయాలను చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అనేక ఇళ్లకు నిధులను ఈ ప్రభుత్వం ఎప్పటికీ విడుదల చేయలేదు. ఆ నిధులు విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు ఏ క్షణమైనా రోడ్డెక్కే ప్రమాదం ఉంది. 18 ఏళ్ల నిండిన మహిళలకు రూ.1500 చెల్లిస్తామని ఇచ్చిన హామీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతరులకు 50 ఏళ్లకే పెన్షన్ చెల్లిస్తామని చెప్పిన వాగ్దానం ఏమైందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ హామీలను అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికే జగన్ ఉండుంటే ఏపాటికి ఆ పథకం లబ్ధి అంది ఉండేది అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాక మానదు అంటూ పలువురు పేర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ చేపట్టిన ఈ ర్యాలీని చూసిన ఎంతోమంది.. బాబు ఇది శాంపుల్ మాత్రమే ముందుంది ముసళ్ళ పండుగ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
Count down started for EVM Govt.
Huge rally in Narsipatnam.4 నెలలకే ఇంత భారీ వ్యతిరేఖత బయట పడిందా ?
చంద్రబాబు హామీల నుండి ఎన్నాళ్ళో తప్పించుకోలేరు.
ఈ రోజు నర్సీపట్నం ఒక Sample మాత్రమే.
త్వరలో pension లు కొత్తవి కలపాలి. 9 నెలల నుండి కొత్తగా అర్హులైన వారిని కలపలేదు.… pic.twitter.com/gBHrAURcM8
— Sridhar Reddy Avuthu (@SridharAvuthu) October 21, 2024