EVM Scam : ఏపీలో ‘ఈవీఎం’ అతి పెద్ద స్కాం బయటపడింది..

The biggest scam of 'EVM' has come out in AP

EVM Scam : ఏపీలో ఈవీఎం సిత్రాలు బయటపడుతున్నాయి.. ఏపీలో గెలుపు కోసం చంద్రబాబు, పవన్ లు కలిసి కేంద్రంలోని బీజేపీని మేనేజ్ చేశారని.. ఈవీఎం హ్యాకింగ్ ల వల్లనే గెలిచారని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోనూ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని క్లియర్ కట్ గా అర్థమైంది.

ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి ఆధారాలతో సహా నిరూపించాడు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో హిందూపూర్ మున్సిపాలిటీ 36వ వార్డులో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని లెక్కలు బయటపెట్టారు.

36వ వార్డులో పోలింగ్ బూత్ నంబర్ 28లో మొత్తం 578 ఓట్లు ఉన్నాయి.ఇందులో అనూహ్యంగా కాంగ్రెస్ కు 464, టీడీపీకి 95, నోటా 8 వచ్చాయి. అధికార వైసీపీకి ఒక్కటే ఓటు పడింది. ప్రతీ పోలింగ్ బూత్ లో ఇద్దరు ఏజెంట్లు ఉన్నారు. అక్కడ పార్టీ కన్వీనర్, పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్లందరి ఓటువేశారు. అయినా వైసీపీకి ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే పడిందని చెబుతున్నారు.

ఇదే కాదు రాష్ట్రవ్యాప్తంగా 12శాతం ఓట్లు ఎక్కువగా పడ్డాయి. వాటి వ ల్ల టీడీపీ గెలిచింది. ఇదో పెద్ద స్కాంగా చెప్పవచ్చు. ఇప్పుడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతోంది.