రాష్ట్రంలో రెండు నెలల కిందట ముంచెత్తిన వరదల వల్ల అనేక ప్రాంతాలు నీట మునిగాయి. లక్షలాదిమంది ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు. వరదలు వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని విడుదల చేసినట్లు చెబుతోంది. అయితే ఈ నష్టపరిహారం ఎంత విడుదల చేశారు, బాధితులకు ఎంత చెల్లించారన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఒకొక్కరు ఒక్కో లెక్క చెబుతుండడంతో అసలు నిధులు విడుదలలో వాస్తవంతో తెలియడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా కూటమికి చెందిన ఒక మహిళ నేత వరదలకు సంబంధించి బాధితులకు విడుదల చేసిన నిధులపై గణాంకాలతో సహా వీడియోను విడుదల చేశారు. సదరు మహిళా నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే క్రమంలో నోరు జారేశారు. ఆవిడ చెప్పే లెక్కలకు టిడిపి అగ్ర నాయకులు చెబుతున్న లెక్కలకు పొంతన కుదరకపోవడంతో ఆ వీడియో చూసిన ఎంతోమంది నవ్వుకుంటున్నారు.
వరదలు వల్ల నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.139.75 కోట్లు ఖర్చు చేసినట్లు సదరు మహిళా నేత గణాంకాలను వెల్లడించారు. ఇందులో ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ.89 కోట్లుగా పేర్కొన్న ఆ మహిళ నేత, ఇప్పటి వరకు రూ.79 కోట్లు చెల్లించినట్లు చెప్పిన ఆమె.. ఇంకా అందుబాటులో రూ.10 కోట్లు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అయితే ఇంకా మిగిలిన మొత్తం ఏమైందన్న దానిపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. దీంతోపాటు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రూ.650 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రు లోకేష్ వెల్లడించారు. ఇదే వరద నష్టం పై మాట్లాడిన మంత్రి వంగలపూడి అనిత రూ.602 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
ఈ ముగ్గురు నేతలు చెప్పిన గణాంకాలను చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రభుత్వం ఎంత విడుదల చేసిందో, బాధితులకు ఎంత చెల్లించిందో కూడా తెలియని పరిస్థితి నెలకొందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అయినప్పుడు లెక్కల్లో వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు రూ.89 కోట్లు విడుదల చేశామని చెబుతున్న సదరు కూటమి మహిళా నేత.. రూ.139 కోట్లలో రూ.89 కోట్లు తీసేయగా రూ.50 కోట్ల రూపాయలు ఏమయ్యాయి అన్న విషయాన్ని కూడా చెబితే బాగుండేదంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మంత్రి లోకేష్ రూ.650 కోట్లు అంటుంటే, హోం మంత్రి అనిత మాత్రం రూ.602 కోట్లు విడుదల చేసినట్లు చెబుతున్నారు. ఇలా దొంగ లెక్కలు చెప్పే పులిహోరకు, అగ్గిపెట్టెలకు, కొవ్వొత్తులకు కూడా కోట్లు కొట్టేసారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీ లెక్కలు.. బొక్కలు.. తైతక్కలు
మీ ఆణిముత్యాలు ఒక ఫ్రేమ్ లో పెడితే.. మీరెంత ఎదవలో మీకే తెలుస్తుంది pic.twitter.com/vQX6bniXrO— Inturi Ravi Kiran (@InturiKiran7) October 19, 2024