Parakala Prabhakar : కూటమి ఈవీఎం హ్యాకింగ్.. బాంబు పేల్చిన పరకాల ప్రభాకర్

TDP alliance EVM hacking.. Parakala Prabhakar exposed BJP's conspiracy

Parakala Prabhakar : అనుకున్నదే జరిగింది.. గెలుపు కోసం కూటమి ప్రభుత్వం అన్నంత పనిచేసింది. ఏపీలో ఇంతటి భారీ గెలుపును అసలు ఓట్లు వేసిన ప్రజలే ఊహించలేదు. దాదాపు కొన్ని లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని ఈవీఎంల లెక్కల్లోనే బయటపడింది. చంద్రబాబు, మోడీ కలిసి ఏపీలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు దాన్నే ధృవపరిచేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త దేశంలో మరో బాంబు పేల్చాడు.

79 లోక్‌సభ స్థానాల్లో ఫలితాలను తారుమారు చేసి బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని రాజకీయ ఆర్థికవేత్త, రచయిత పరకాల ప్రభాకర్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఏడు దశల సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీగా తేడా ఉందని ఆయన బాంబు పేల్చారు. వివరంగా విశ్లేషించిన మహారాష్ట్రకు చెందిన పౌరుల వేదిక ఓట్ ఫర్ డెమోక్రసీ (విఎఫ్‌డి) నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ ప్రభాకర్ చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నికల సంఘాన్ని బీజేపీ మేనిక్యూలేట్ చేసిందని ఆరోపించారు. ప్రభాకర్ తాజాగా కేరళలో ఈ విషయం బయటపెట్టాడు. పోలయిన తాత్కాలిక ఓట్ల సంఖ్య, ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది గణనలో పొంతన లేకపోవడాన్ని ప్రభాకర్ ఎత్తిచూపగా, దాదాపు 5 కోట్ల ఓట్లు అదనంగా లెక్కించబడ్డాయన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా అంకెలు సర్దుబాటు చేస్తున్నారనడానికి తుది గణాంకాలను విడుదల చేయడంలో జాప్యమే నిదర్శనమని అన్నారు.

1952 నుండి దేశ చరిత్రలో, పోలైన ఓట్ల తాత్కాలిక , చివరి గణాంకాల మధ్య వ్యత్యాసం ఎప్పుడూ 1 శాతం దాటలేదని, 2024లో తేడా 12.5 శాతంగా ఉందని ఆయన అన్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో 12.5 శాతం ఓట్లు అదనంగా వచ్చాయి. అన్నీ కలిపి దాదాపు ఐదు కోట్ల అదనపు ఓట్లను లెక్కించారు’ అని ఆయన చెప్పారు. రెండో దశ ఓటింగ్‌లో లెక్కించిన ఓట్ల తుది అంకెను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదని ఆయన అన్నారు. “ఈ రోజు కూడా రెండో దశ పోలింగ్ గణాంకాలు ప్రకటించలేదు. స్థూల ఓటింగ్ ఎంత, రెండో దశలో భారత ప్రజలు పోల్ చేసిన ఓటింగ్ శాతం ఎంత అనేది ఇప్పుడు కూడా మనకు తెలియదు. ఆసక్తికరంగా రెండవ దశలో బిజెపి స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, ”అని ఆయన అన్నారు. ఇతర దశల్లో ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని మాత్రమే ప్రకటించిందని, ఓటింగ్ శాతంపై వాస్తవ గణాంకాలు ప్రకటించలేదని ఆయన అన్నారు. “ ఓవరాల్ గా పోల్ అయిన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం 5 కోట్లు. అయితే దీన్ని 540 సీట్లతో విభజిస్తే 15 రాష్ట్రాల్లో 79 సీట్ల తేడా చాలా ఎక్కువ. కాబట్టి 79 సీట్లలో ఈ 5 కోట్ల ఓట్లు తేడా కొట్టాయి’’ అని ఇవే బీజేపీని కేంద్రంలో అధికారంలో నిలపాయని.. ఖచ్చితంగా ఈవీఎంలను ప్రభావితం చేశారని ప్రభాకర్ బాంబు పేల్చాడు. దీంతో ఏపీలో ఒడిశాలో బీజేపీ గెలుపునకు ఈవీఎంలను హ్యాక్ చేయడమే కారణమన్న బలమైన వాదనకు బలం చేకూరుతోంది.