లడ్డూ వివాదంలో చంద్రబాబుదే తప్పు.. షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు  

తిరుమల లడ్డూ వివాదం దేశాన్ని కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. గత జగన్ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడరంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలిపారని ఆరోణలు రావడంతో హిందువలంతా కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మరోవైపు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటాగానే రియాక్ట్ అవుతున్నారు.

దీంతో శ్రీవారి లడ్డూ వివాదంపై పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై వైసీపీ నేత , మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సైతం చంద్రబాబు ఆధారాలు లేకుండా రాజీకయ ఉద్దేశంతోనే తిరుమల లడ్డూపై కామెంట్స్ చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తిరుమల లడ్డూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేపనూనె, జంతువుల కొవ్వు, పందికొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. లడ్డూ వివాదం గురించి దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది. లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైసూరు లేదా ఘజియాబాద్ ల్యాబ్ ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని చంద్రబాబు సర్కార్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో లడ్డూ వివాదంలో చంద్రబాబే తొందరపడి వ్యాఖ్యలు చేసినట్టు అయిందని సుప్రీంకోర్టు తేల్చినట్టు అయింది. ఈ పరిణామం వైసీపీకి కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.