గుంటూరు జిల్లా తెనాలిలో మూడు రోజుల క్రితం ప్రేమించిన యువకుడి చేతిలో మృతి చెందిన సహనకు సంబంధించిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తలపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన యువతి చికిత్స పొందుతూ ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సహన మృతికి ప్రేమికుడు నవీన్ కారణంగా పోలీసులు నిర్ధారించారు. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం ఆమె హత్యకు కారణమైంది. ప్రస్తుతం నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా బహిర్గతమైంది. ఇందులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నవీన్ సహనపై దాడి చేసిన తర్వాత ముందుగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడే యువతిని బెడ్ పై వేసి ఆసుపత్రిలోని సిబ్బందితో మాట్లాడాడు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో నవీన్ మరో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. సహనను ఆసుపత్రిలోకి నవీన్ ఒక్కడే తీసుకుని వస్తూ ఆ పుటేజీలో కనిపించాడు. అప్పటికే యువతి స్పృహలో లేని స్థితిలో ఉన్నట్టు కనిపించింది. తొలుత మెట్లుపైకి ఎక్కి లోపలికి తీసుకెళ్లిన యువకుడు ఆ తర్వాత మళ్లీ కిందకు తీసుకుని వచ్చినట్లు సిసిటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఆసుపత్రికి యువతని కారులో తీసుకువచ్చాడు. అక్కడ వైద్యుడు లేరని చెప్పడంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి నవీన్ పరారయ్యాడు. యువతి బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించిన వైద్యులు చికిత్సను అందించారు. మెరుగైన వైద్యశాల అందించినప్పటికీ ఆమె మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం బహిర్గతమైనది. ఈ కేసులో కీలకమైన ఆధారంగా ఈ వీడియో ప్రస్తుతం నిలిచినట్లు పోలీసులు చెబుతున్నారు.
‼️CC TV visuals ‼️
నవీన్ దాడిలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువతిని మొదట ప్రవేటు ఆసుపత్రిలోకి తీసుకువెళ్ళాడు.
డాక్టర్ లేరని చెప్పడంతో మరొక ఆసుపత్రికి తీసుకెళ్ళిన నవీన్.వీరిద్దరూ ఆసుపత్రిలో కీ వెల్తుండగా సిసి కెమెరాల్లో రికార్డు అయిన విజువల్స్ pic.twitter.com/ByS077ZFx7 https://t.co/5ux6pMKOof
— AVM🧢 (@EvmProductions7) October 23, 2024