చంద్రబాబుకు అభిమానులు ఉంటారు. కానీ జగన్ కు డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ప్రాణమిచ్చే పర్సన్స్ చాలా మంది జగన్ కోసం ఫైట్ చేస్తున్నారు. జైలుకు కూడా వెళుతున్నారు. జగన్ పై ఈగ వాలనీయకుండా కాపు కాసే వారు ఎందరో.. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ నాగరాజు ఓ యూట్యూబ్ చానెల్ లో వైసీపీ నేత సతీష్ రెడ్డిని ఇంటర్వ్యూకు పిలిచారు.
74 ఏళ్ల వయసున్న వృద్ధుడు అయిన చంద్రబాబును 57 రోజులు జైల్లో పెట్టారు ఇది న్యాయమా అంటూ సుమన్ టీవీలో ప్రస్తుతం ఉన్న జర్నలిస్ట్ నాగరాజు ప్రశ్నించాడు. దానికి సతీష్ రెడ్డి ఫస్ట్ టైం నాగరాజుకు కూడా మారు మాట్లాకుండా తడబడేలా సమాధానం ఇచ్చాడు అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇదే చంద్రబాబు, కాంగ్రెస్ తో కలిసి వైఎస్ఆర్ చనిపోయినప్పుడు 36 ఏళ్ల యువకుడిని.. తండ్రి చనిపోయాడన్న కనీస ఉదారత కూడా లేకుండా జగన్ ను 18 నెలల పాటు జైల్లో పెట్టాడు. అవినీతి చేశాడని.. అక్రమం చేశాడని అమానుషంగా జైల్లో జగన్ ను వేసినప్పుడు తప్పు అనిపించ లేదా? పాపం అని’ అంటూ నాగరాజు చెంప పగిలేలా వైసీపీ నేత సతీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
నాడు చంద్రబాబు ప్రవర్తించిన తీరు, కాంగ్రెస్ చేసిన ద్రోహం చూస్తే చంద్రబాబును జైల్లో పెట్టడం ఏమాత్రం తప్పు కాదని సతీష్ రెడ్డిని వాదిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి చేయలేదా? టీడీపీ అవినీతికి దూరంగా ఉన్నారా? వీరిద్దరూ అవినీతి చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో దేశంలో రాజకీయ పార్టీలన్నీ అవినీతి చేసేటప్పుడు జగన్ ను ఎందుకు నాడు బలిపశువును చేశారని సతీష్ రెడ్డి ప్రశ్నిస్తే నాగరాజు వద్ద సమాధానం లేకుండా పోయింది..
1st టైం నాగరాజు కుడా తడబడ్డాడు 🔥👌
5 సార్లూ పత్యార్ధిగా పోటి చేసిన మీరూ అర్ధం చేసుకున్నట్టు ,
కలిసి ఉన్న వాళ్ళు కూడా అర్ధం చేస్కోలేరు ❤️🥺🙏#SatishReddy Anna ❤️👌👌🙏 pic.twitter.com/i1yywUiBSW— Rohit_Gangireddygari (@Rohit_Ysrcp) October 11, 2024