నా మరిది ‘చంద్రబాబు’నే ప్రశ్నించే హక్కు సుప్రీంకోర్టుకు ఉందా?

చిన్నమ్మ పూర్తిగా మారిపోయింది. తన తండ్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కొన్ని సంవత్సరాల వరకూ వ్యతిరేకించారు పురందేశ్వరి. 2019 వరకూ కూడా చంద్రబాబును దగ్గరకు రానీయకుండా వెలివేశారు. అయితే చంద్రబాబు ఓటమి బాధలో ఇక అందరినీ కలిపేసి ఐకమత్యమే మహాబలం అని నందమూరి కుటుంబంతో ఏకమయ్యారు.

అప్పటి నుంచి పురందేశ్వరికి పెద్దపీట వేశారు. ఏకంగా బీజేపీ పెద్దలతో మాట్లాడి ఆమెకు ఏపీ బీజేపీ చీఫ్ పదవి కూడా కట్టబెట్టారు. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని బీజేపీ వెళ్లింది. ఈ పొత్తు పొడుపు వెనుక పురంధేశ్వరి కీలక పాత్ర పోషించారు. చంద్రబాబుకు పూర్తిగా సహకరించారు. కూటమి గెలుపుతో ఆమెకు అందలం దక్కింది.

ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదంలో పూర్తిగా ఇరుక్కుపోయిన మరిది, ఏపీసీఎం చంద్రబాబుకు మద్దతుగా పురంధేశ్వరి రంగంలోకి దిగారు. సుప్రీంకోర్టు తాజాగా ఆధారాలు లేకుండా తిరుమలలడ్డూ కల్తీ అని మాట్లాడి వంద కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబును ఉతికి ఆరేసింది. ఇదే నా సీఎంగా.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చేసే పద్ధతి అంటూ కడిగేసింది.

దీంతో కక్కలేక మింగలేక ఉంటున్న చంద్రబాబు కు మద్దతుగా చిన్నమ్మ పురందేశ్వరి రంగంలోకి దిగారు. అసలు ఒక పరిపాలన దక్షుడు అయిన సీఎం చంద్రబాబును కోర్టులు ప్రశ్నించే హక్కు ఉందా? ఇందులో ఎంత వరకూ న్యాయమో ఆలోచించాలి అంటూ ఏకంగా సుప్రీంకోర్టు నే ఎదురిస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.