YS Jagan : ఇలాంటి ఒక లీడర్ కావాలి కదా..!

YS Jagan, Achyutapuram victims

YS Jagan : నాయకుడంటే నడిపించాలి.. ముందుండాలి.. ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూడాలి.. అప్పుడు ఆ నేత గుండెల్లో ఉంటాడు. నాడు వైఎస్ఆర్ ప్రజల పక్షపాతిగా ఎలా మారాడో.. ఇప్పుడు జగన్ కూడా అలాంటి బాట పడుతున్నాడు. అవును నిజం.. జగన్ ప్రజల క్షేత్రస్థాయిలోకి వెళ్లి మరీ సమస్యలు తెలుసుకుంటున్న తీరు ఫిదా చేస్తోంది.

జగన్ అంటే ఒక అండా..దండా అని ప్రజలు భావిస్తున్నారు. అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించడానికి మొన్న పవన్ కళ్యాణ్ వస్తే పెద్దగా జనం లేరు. నిన్న చంద్రబాబు వస్తే అసలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.. అదే జగన్ వస్తే జనసంద్రమైంది. ఆస్పత్రి ప్రజలతో నిండిపోయింది. ఒక గొప్ప నాయకుడికే ఇంతటి ప్రజాదరణ ఉంటుంది.

ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచిన చంద్రబాబు, పవన్ లకు ఆ స్థాయి లేదని వారు వచ్చినప్పుడు జనాలను బట్టే తెలుస్తోంది. కానీ జగన్ వస్తే మాత్రం జన ఉప్పెన కనిపిస్తోంది. నినాదాలు, జగనన్న పిలుపులతో హోరెత్తుతోంది..

జగన్ కూడా ఏదో ఫొటోల కోసం కాకుండా బాధితుల మంచంపై కూర్చొని వారి చేతిలో చేయి వేసి.. వారి దెబ్బలు చూసి ఒక అన్నలా.. తండ్రిలా వారి సమస్యలు తెలుసుకున్న వీడియోలు అందరినీ ఉద్వేగానికి గురిచేశాయి. బాధితులకు ఎంతో గొప్ప ఓదార్పునిచ్చాయి. ‘ఇలాంటి ఒక లీడర్ కావాలి కదరా’ అంటూ నెటిజన్లు జగన్ వీడియోలను షేర్ చేస్తూ కొనియాడుతున్నారు.