ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రశ్నించడానికి పార్టీని పెట్టాను అంటూ అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికీ ఆ మాటలు ఆయన చెబుతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటితే.. చేతలు కనీసం గోడ కూడా దాటవు. అటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నెన్నో మాటలు చెబుతూ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలకు గురిచేస్తోంది. కోనసీమ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, ఈ విషయాన్ని పోలీసులకు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ రాజమండ్రి ఎయిర్పోర్ట్ వద్ద పవన్ కళ్యాణ్ కాన్వా ఎదుట నిలబడి విన్నవించుకునే ప్రయత్నం చేశారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ కలిసి తన గోడు వెళ్ళబోసుకొనేందుకు ఆ మహిళ తీవ్రస్థాయిలో ప్రయత్నించింది. అయితే సదరు మహిళ ఆవేదనను కనీసం పట్టించుకోని పవన్ కళ్యాణ్ కారు ఎక్కి వెళ్లిపోయారు.
అనంతరం సదరు మహిళ మీడియాతో మాట్లాడుతూ తన కూతురికి న్యాయం చేయాలని, తన కూతురు ఎంతో క్షోభను అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురుకు న్యాయం చేయాలంటూ ఆమె బోరున విలపించారు. ఆమె వ్యక్తం చేసిన ఆవేదనకు సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న కొంతమంది తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. నీతి మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ కు ఈ మహిళ కన్నీళ్లు కనిపించడం లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడానికి పుట్టిన పెద్ద మనిషిగా చెప్పుకునే జనసైనికులు దీని గురించి ఏం చెబుతారు అంటూ పలువురు నిలదీస్తున్నారు. కనీసం కారు దిగి ఆ తల్లిని ఓదార్చే ప్రయత్నం చేయని పవన్ కళ్యాణ్.. ఇంక బాధితులకు ఏం న్యాయం చేస్తారంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

నా బిడ్డ కు న్యాయం చేయండి అంటూ ఆ తల్లి కారు ముందుకు వచ్చి వేడుకుంటుంటే..💔

కనీసం కారు నుంచి దిగకుండా, ఏమైంది అని కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు…💦

తూ @PawanKalyan నువ్వు ఇంకో సారి శాంతి భద్రతలు తొక్క తోలు అని మాట్లాడకు💦💦 pic.twitter.com/MKVqL7uH96
— YSRCP UK (@uk_ysrcp) November 1, 2024