పవన్, లోకేష్.. చంద్రబాబు అదే చేస్తున్నాడా.?

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి సాధించడంలో కీలకంగా వ్యవహరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేయడం ద్వారా వైసిపి ఓటమికి పవన్ కళ్యాణ్ కారణమయ్యారు. రాష్ట్రంలో కూటమి ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే అటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా.? అంటే అవునన్న సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ను ప్రభుత్వంలో ఏకాకిని చేసే ప్రయత్నం జరుగుతోంది. డిప్యూటీ సీఎంగా, కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కు అధికార వర్గాల్లో పట్టు లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, దారుణాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పలు జిల్లాలకు చెందిన అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి ఎక్కడ అమలు కావడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ లో ఆవేశం కట్టలు తెంచుకొని కొద్దిరోజుల కిందట హోం మంత్రి అనిత పై వ్యాఖ్యానించేందుకు కారణమైనట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు చెల్లుబాటు కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఎందుకంటే ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రభావం పెరిగిపోతే తన కుమారుడు ఎదుగుదలకు ఇబ్బందిగా ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ను ఎదగనీయకుండా, తనదైన స్టైల్ లో పాలన సాగించకుండా చేసేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే పవన్ ” చంద్రబాబు నాయుడు కట్ చేసినట్లు చెబుతున్నారు. తాజాగా ఇవన్నీ గమనించిన తర్వాతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలను చేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి.. కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దూరంగా పెడుతున్నారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గతంలో అధికారంలోకి రాకముందు లోకేష్ పాద నమస్కారం చేశాడని, కానీ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాటించవద్దంటూ అధికారులకు లోకేష్ ఆదేశాలను దారి చేస్తున్నాడని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ను డిగ్రెడ్ చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వచ్చిన గంట తర్వాత మందకృష్ణ మాదిగ పవన్ కళ్యాణ్ విమర్శించాడని, అంటే చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని ఇక్కడే అర్థం చేసుకోవచ్చని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

చంద్రబాబు మార్పు రాజకీయాలకు ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో వీటిని పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారని స్పష్టం చేశారు. కూటమిలో కొనసాగే అవకాశం లేకుండా చేస్తారని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే నాయకుడు కూటమిలో ఉంటే తన కుమారుడు లోకేష్ కు ప్రమాదకరంగా పరిణమిస్తాడన్న విషయం చంద్రబాబు నాయుడుకు తెలుసన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడానికి అడ్డంకులు ఎదురవుతాయని భావించే చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంచుమించుగా 20 శాతానికిపైగా కాపులు ఉన్నారని, అటువంటి పెద్ద సామాజిక వర్గాన్ని ఏరోజైనా ఎదుర్కోవాలంటే కష్టం కాబట్టి ప్రణాళిక ప్రకారం కాపులను, జనసేనను అణచివేసే కార్యక్రమం మొదలు పెట్టారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తర్వాత గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే నిజమేనన్న భావనను జన సైనికులు, కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తొక్కితేనే లోకేష్ సీఎం అవుతాడు అన్న వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించబట్టే ఆ పనిని ప్రణాళిక ప్రకారం చేస్తున్నారంటూ పలువురు పేర్కొంటున్నారు.