ఏరు దాటాక తెప్ప తగిలేయడం అంటే ఇదేనేమో.. పవన్ కళ్యాణ్ రాజకీయం చూస్తే ఇప్పుడు అలానే అనిపిస్తోంది. అవును.. ఎన్నికలకు ముందు వరకూ తనకు కులం, మతం లేదని.. జాతీయ వాదిని అని.. భారతీయుడిని అన్న పెద్ద మనిషి ఇప్పుడు కాషాయ రంగు దుస్తులు ధరించి గుడి మెట్లుకడిగి పక్కా హిందుత్వవాదిలా రాజకీయం చేస్తున్నాడు.
మొన్నటి వరకూ కులం లేదని.. మతం భావన లేదన్న పవన్ కళ్యాణ్.. నా కూతురు క్రిస్టియన్ అని.. తాను బాప్టిజం తీసుకున్నానని.. హిందుత్వ గొడవలు చేసింది బీజేపీ అని తిట్టిపోశాడు ఇదే పవన్ కళ్యాణ్.. బీఫ్ తిని ముందుకు వెళతానని అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన వీడియో వైరల్ అయ్యింది.
తాను జీసస్ ను ఆరాధిస్తానని.. ముస్లిం అల్లాను గౌరవిస్తానన్నాడు మన పవన్.. తాను కమ్యూనిస్టును అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక జై భీం అంటూ తాను దళిత పక్షపాతిని అంటూ చెప్పుకొచ్చాడు.
అధికారంలోకి రాకముందు దశావతారం అంటూ ప్రకటించిన పవన్ కళ్యాణ్ కుల, మతాలకు అతీతంగా ప్రవర్తించాడు. ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం వచ్చేసరికి వైసీపీని టార్గెట్ చేస్తూ కాషాయ దుస్తులు వేసి ప్రశ్నించిన నటులు ప్రకాష్ రాజ్, కార్తీలను తిట్టిపోస్తున్నారు.
దశావతారం కజిన్ బ్రదర్.. కుల, మతావతారం pic.twitter.com/l87hoHu4lm
— Inturi Ravi Kiran (@InturiKiran7) September 26, 2024