బాబు.. ఈవీఎం.. ఏబీఎన్ చెప్పిన నిజం!

బాబు.. ఈవీఎం.. ఏబీఎన్ చెప్పిన నిజం!

ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడికెళ్లినా జనం హోరెత్తుతున్నారు. చంద్రబాబు వెళితే అసలు సీఎం వచ్చాడు అని కూడా తొంగి చూడడం లేదు. జనాదరణ విషయంలో జగన్ ను మించిన వారు లేరు. అయితే ఓట్ల ఫలితాలు మాత్రం తారుమారుగా వచ్చాయి. ఏపీలో జగన్ ఓడిపోయారు. చంద్రబాబు కూటమి గెలిచారు. అయితే ఇప్పటికీ బాబు గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయి.

ఏపీలో కూటమి గెలుపుపై ఇప్పటికీ జనంలో, వైసీపీలో అనుమానాలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని అందరూ అనుమానిస్తున్నారు. కేంద్రంతో అందుకే పొత్తు పెట్టుకున్నారని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైసీపీ నేతలు పేర్కొన్నారు.

సింగపూర్‌లో కూర్చొని టెక్నికల్‌గా ఈవీఎంలను ట్యాపరింగ్‌ చేశారా? మరొక చోట చేశారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బార్‌కోడ్‌ల ద్వారా ట్యాంపరింగ్‌ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబు ఇదంతా నడిపించారని వైసీపీ నేతలు ఎప్పటినుంచో చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కామ్‌ జరిగిందని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు.