పుణ్యాత్ములు.. లోకేష్.. పవన్.. ఇదే సాక్ష్యం

Mangalagiri Pithapuram flooded with Lokesh Pawan's win

అప్పట్లో సినిమాల్లో ఐరెన్ లెగ్ ఉండేవాడు. ఆ కమెడియన్ ఎక్కడ కాలు పెడితే అక్కడ అరిష్టమే.. మొత్తం నాశనమే.. అలాంటి అన్ లక్కీ హ్యాండ్ లు మన ఏపీ పాలిటిక్స్ లోనూ ఉన్నాయని కొందరు నెటిజన్లు వీడియోలు షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. వారు ఎవరో కాదు మన తొలిసారి ఎమ్మెల్యేలు పవన్, లోకేష్ లే..

అవును.. ఏపీ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఘోర ఓటములతో పవన్, లోకేష్ ల పరువు పోయింది. దిగ్గజ నేతలుగా.. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి కూడా పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయాడు. అందుకే ఈసారి పిఠాపురం నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో గెలిచాడు.

లోకేష్ బాబు కూడా ఓసారి ఓడిపోయి ఈసారి మంగళగిరి నుంచి భారీ మెజార్టీతోనే విజయం సాధించాడు. ఇద్దరు నేతలు గెలిచానా వారి హ్యాండ్ లక్కీ హ్యాండ్ కాదని తెలిసిపోయింది.

పవన్, లోకేష్ ఇద్దరి నియోజకవర్గాలు ఇటీవల వచ్చిన రెండు తుఫాన్ లకు నిండా మునిగాయి.. దీంతో మంగళగిరి, పిఠాపురం వాసులు మండిపడుతున్నారు. ప్రభుత్వంలో కీలక మంత్రుల నియోజకవర్గాలే మునిగినా పట్టించుకోవడం లేదని.. ఇందుకేనా గెలిపించింది అంటూ మీడియా ముందు దుమ్మెత్తిపోస్తున్నారు.

అంతేకాదు.. లోకేష్, పవన్ లది ఐరెన్ లెగ్ అని.. వారు గెలిచిన ఏడాదే తాము నిండా మునిగామని.. పుణ్యాత్ములు అంటూ మీమ్స్, ట్రోల్స్ తో హోరెత్తిస్తున్నారు.