చెప్పేందుకే నీతులు ఉంటాయి..కానీ పాటించేందుకు కావని పచ్చ మీడియాను చూస్తే అర్థమవుతుంది. ఏదైనా వారు వైరల్ చేయగలరు.. తమకు నచ్చని వారి మీద బురద జల్లగలరు.. తన 100 రోజుల పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు తిరుమల లడ్డూ విషయంలో నెపాన్ని మొత్తం జగన్ పై నెపాన్ని నెట్టేసి పండుగ చేసుకున్నాడు చంద్రబాబు. తన అనుంగ పచ్చ మీడియాలో పుంకాను పుంకానులుగా కథనాలు రాయించి బురద జల్లించాడు.
అయితే ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది. తిరుమల లడ్డూ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే తిరుమల లడ్డూ విషయంలో ఆధారాలు లేకుండా చంద్రబాబు ఎలా అలా దుష్ప్రచారం చేస్తాడని సుప్రీంకోర్టు గడ్డి పెట్టింది.
దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాడ్ అయిపోయిన తమ హీరో చంద్రబాబును లేపడానికి మళ్లీ సానుభూతి డ్రామాలు మొదలుపెట్టింది పచ్చ బ్యాచ్. ముఖ్యంగా చంద్రబాబు ప్రోద్బలంతో సామాన్యుడిగా ఉన్న వంశీ ఇప్పుడు మహా టీవీకే ఓనర్ అయిపోయాడు. ఆయన లడ్డూ వివాదంలో బ్యాడ్ అయిపోయిన పవన్, చంద్రబాబు ల గురించి మంచివాడు.. చెడ్డవాడు.. అంటూ నీతి సుక్తావాళి చెప్పుకొచ్చాడు. వీళ్లు ఇద్దరూ మంచివారని.. చెడ్డవాల్లది ఇప్పుడు పైచేయి అయినా అంతిమంగా మంచే గెలుస్తుందంటూ తన వాళ్లను వెనకేసుకొచ్చారు.
మహా వంశీ విలనిజం వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలైన విలన్స్ ఎవరో జనాలకు తెలుసు అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
మంచి వాడు ముందు కష్టపడవచ్చు.. కానీ ఓడిపోడు.. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు.. కానీ ఓడిపోతాడు #SatyamevaJayate pic.twitter.com/0GkaNeEBts
— Inturi Ravi Kiran (@InturiKiran7) September 30, 2024