Mahaa Vamshi: మహా వంశీ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను లాగానే ఈ మహా టీవీ చేతుల్లో పెట్టి పెట్టుబడి పెట్టి చంద్రబాబు నిలబెట్టిన మరో వ్యక్తినే వంశీ. మహా టీవీ చైర్మన్ గా మారిన మహా వంశీ అంతకుముందు ఓ అనామకుడు. ఎప్పుడైతే చంద్రబాబు పంచన చేరాడో ఏకంగా మహాటీవీకి ఓనర్ అయిపోయాడు. దానికి కమ్మ వారి నుంచి పెట్టుబడులు సమీకరించి ఇప్పుడు ఏకంగా పచ్చ మీడియాలాగా ఎదిగి బాబు సేవలో తరలిస్తున్నారు..
అచ్చం చంద్రబాబు లాగానే పచ్చపాతిగా మారిపోయాడు మహా వంశీ. ఎవరు సాయం చేస్తే కమ్మ’గా పలకరిస్తే వారి పంచన చేరి మొత్తం దాసోహమవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. తనను మీడియాధిపతిని చేసిన చంద్రబాబు రుణాన్ని ప్రతీ విషయంలోనూ తీర్చుకుంటున్నాడు. చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటూ జగన్ పై ఘోరంగా విష ప్రచారం చేయడంలో ‘మహా వంశీని’ మించిన వారు లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా మహా వంశీ చేసిన కామెడీ వైరల్ అయ్యింది. తన మహా టీవీలో వంశీ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తన భార్య భువనేశ్వరికి ఒక చీరను ఎంపిక చేసి బహుమతిగా ఇచ్చాడట.. ఆ చీర అస్సలు బాగా లేకపోవడంతో అది కట్టుకోకుండా భువనేశ్వరి బీరువాలో భద్రంగా దాచుకుంటోందట.. అమరావతి, పోలవరం కట్టడం తెలుసు బాబుకు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వచ్చు.. కానీ ఈ చీరల ఎంపిక ఎలా తెలుసు’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ మహా వంశీ చేసిన కామెడీ నవ్వులు పూచించింది.
మహా న్యూసెన్స్ టాల్కం పౌడర్ వంశీ కామెడీ.. pic.twitter.com/vOo4YSMDLZ
— Inturi Ravi Kiran (@InturiKiran7) August 9, 2024