తిరుమలకు లైన్ క్లియర్.. జగన్ తో పెట్టుకుంటే ఇట్లుంటదీ

శ్రీవారి లడ్డూ వివాదం పూర్తిగా రాజకీయంగా మారింది. అలాంటి సమయంలో జగన్ ప్రకటన వచ్చింది. శనివారం తిరుమల స్వామిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు సాయంత్రం జగన్ తిరుమల చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. అయితే లడ్డూ వివాదం నేపథ్యంలో రెండు రోజుల పాటు జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి పార్టీలు, హిందూ సంఘాలు పిలుపునిస్తున్నాయి. తిరుమల స్వామివారి దర్శనంలో హిందూ మతంపై తనకున్న నమ్మకంపై జగన్ ప్రకటన చేసేందుకు అనుమతిస్తామని టీటీడీ చెబుతుండగా.. ఆ ప్రకటన చేయకుంటే అడ్డుకుంటామని కూటమి పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

అయినా జగన్ పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. తిరుమల శ్రీవారిని ఎలాగైనా దర్శించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆయన తిరుమలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు మహాకూటమిలోని పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవద్దని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిర్ణయించింది. అలా కాకుండా జగన్ రాక మార్గంలో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. దీంతో జగన్ తిరుమల పర్యటనకు దాదాపుగా అడ్డంకులు తొలగినట్లేనని భావిస్తున్నారు. తిరుమలలో జగన్‌ను అడ్డుకోవడం తప్పుడు సందేశాన్ని పంపుతుందని హెచ్చరించిన కూటమి పార్టీలు దీనిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

ఒకవైపు టీటీడీ స్వతంత్ర సంస్థగా మారి, మరోవైపు జగన్‌ను అడ్డుకుంటే.. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్న సంకేతం పంపుతుందని అధికార కూటమి భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నేతలను ఆదేశించారు. తిరుపతి లడ్డూలో జగన్ పైచేయి సాధించినట్లు తెలుస్తోంది.