టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలకు పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సామాంత రాజ్యాలుగా భావిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక, మైనింగ్ సహా ప్రకృతి వనరులను గుప్పిట పట్టి అమ్మేసుకుంటున్నారు. దర్జాగా దందా నిర్వహిస్తున్నారు.
ఇక ఫ్యాక్షన్ రాజ్యమేలే అనంతపురంలో అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గానే ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. నా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతీ లిక్కర్ షాప్ నాకే కావాలి.. ఎవరికైనా వెళ్లినా నాకు వాటా ఉండాల్సిందేనని హుకూం జారీ చేశాడు. ‘తెలుగుదేశం, జనసేన నా కొడకల్లారా ఎవరైనా లిక్కర్ దందాలో వేలుపెడితే తాటతీస్తాను’ అంటూ ఓపెన్ గానే జేసీ హెచ్చరికలు పంపాడు.
ఇసుక, సారాయి, క్లబ్బుల దందా అవసరం లేదు.. లిక్కర్ దందాలో మాత్రం వేలుపెడితే ఊరుకోను. మీరు ఎంతైనా దోచుకోండి.. లిక్కర్ షాపుల్లో మాత్రం నాకు 15-20 శాతం కమీషన్ నాకు ఇవ్వాల్సిందే అంటూ ఓపెన్ గానే హెచ్చరించారు.
ఒక టీడీపీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఓపెన్ గానే 15 శాతం నాకు కమీషన్ కావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా బెదిరింపులకు దిగిన వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేలు ఇలా ఉంటే ఇక అభివృద్ధి ఎక్కడని.. అంతా దోపిడీనే అంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
తెల్దేశం నాకొడుకయినా .. జన్సేన నాకొడుకయినా..
ఇసుక దోపిడీలో అయినా.. మద్యం దోపిడీలో అయినా..
నా కమీషన్ నాకు ఇవ్వాల్సిందే.. pic.twitter.com/3lCExqOEMg— Inturi Ravi Kiran (@InturiKiran7) October 13, 2024