మాట ఇచ్చే ముందే ఆలోచిస్తాడు.. కానీ మాట ఇచ్చాక, ఇచ్చిన మాట ప్రకారం అన్ని జరగాల్సిందే.. జగన్ పాటించిన సూత్రం ఇదే.. దొంగ మాటలతో, పొత్తులతో గెలిచినంత ఈజీ కాదు, మాట మీద నిలబడటం అంటే?? ఇప్పుడు చంద్రబాబుకు అదే అర్థమవుతోంది. జగన్ ఇచ్చిన నవరత్నాలన్నీ అమలు చేశాడు. ఆయన తండ్రి నుంచే ఈ హామీలపై మాటల మీద నిలబడడం జగన్ కు అలవాటు అయ్యింది. ఆయన రక్తంలోనే ఇది ఉంది. ఈ మాటఅన్నది ఎవరో కాదు స్వయాన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హోస్ట్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ.
అవును నిజం ఇదీ.. ఏబీఎన్ వెంకటకృష్ణ చంద్రబాబు మీద అసలు నమ్మకమే లేదు. ఆయన హామీలు నెరవేరుస్తాడన్న ఆశ కూడా లేదు. అందుకే చాలా సందర్భాల్లో చంద్రబాబు ఫెయిల్యూర్ కు కారణాలను ఏకంగా ఏబీఎన్ లోనే చెప్పేశాడు.
అదే సమయంలో జగన్ గొప్పతనాన్ని బయటపెట్టాడు. ‘జగన్ మోహన్ రెడ్డి సీఎం కాగానే ఎన్నికల హామీలు అమలు చేశాడు. అసలు ఇలా దేశంలోనే అంత తొందరగా హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరు. అందరు సీఎంలు తొలి సంతకం.. రెండో సంతకం ఇలా చేశారు తప్పితే జగన్ లా అమలు చేయలేదు. నవరత్నాలు అన్నీ ఆరు నెలల్లోనే అమలు చేశారు జగన్..’ అంటూ పగోడు అయినా కూడా జగన్ చిత్తశుద్ధిపై ఏబీఎన్ వెంకటకృష్ణ పలికిన డైలాగులు వైరల్ అవుతున్నాయి.
ఇదే సమయంలో చంద్రబాబు హామీల అమలులో ఫెయిల్ అయ్యాడని ఏబీఎన్ వెంకటకృష్ణ చెప్పకనే చెప్పాడు. శత్రువు నోట జగన్ ఘనతను విన్నప్పుడు ఆ కిక్కే వేరు.. ఇప్పుడు అదే కనిపిస్తోంది.