Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కల్యాణ్ నీతిగా నిజాయితీగా గెలవలేదా? డబ్బులు కోట్లు విదజల్లి గెలిచాడా? ప్రముఖ అనలిస్ట్, మాజీ న్యాయమూర్తి జడశ్రవణ్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనమయ్యాయి. పవన్ గెలుపుపై అనుమానాలకు బీజం వేస్తున్నాయి.
గత ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయాడు పవన్. అందుకే ఈసారి చంద్రబాబు టీడీపీ, బీజేపీతో కలిసి వెళ్లాడు. ఓట్లు చీలకుండా తక్కువ సీట్లు తీసుకొని పోటీచేశారు. అన్నింట్లోనూ గెలిచాడు. అయితే పవన్ గెలిచాడు అనేకంటే టీడీపీ వల్ల బతికిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంతంగా గెలిచే అర్హత లేకనే ఇలా పవన్ పొత్తులతో నెగ్గుకు వచ్చాడన్న ఆరోపణలున్నాయి.
అయితే ఎన్నికలకు ముందు వరుసగా నాలుగు సినిమాలు ఒప్పుకొని కొన్ని రిలీజ్ కూడా చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాల ద్వారా ఏకంగా రూ.150 కోట్లను నిర్మాతల నుంచి తీసుకున్నాడని.. వాటిని మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు పంచి గెలిచాడని బాంబు పేల్చాడు మాజీ జడ్జి జడ శ్రావణ్..
నిక్కచ్చిగా మాట్లాడే జడ శ్రవణ్.. నిజానికి టీడీపీ కూటమికి సపోర్టుగా వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు మాట్లాడేవాడు. ఆయన మాటలకు విశ్వసనీయత ఉండేది. అలాంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 150 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాడని.. కావాలంటే వేంకటేశ్వరస్వామి, వారాహి అమ్మవారి మీద ప్రమాణ చేసి నేను ఖర్చు పెట్టలేదని అనమనండి అంటూ సవాల్ చేశారు జడ శ్రావణ్. అలా చేస్తే తాను ఇక జీవితంలో పవన్ పేరు ఎత్తను అంటూ తొడగొట్టారు. దీంతో చూస్తుంటే పవన్ కళ్యాణ్ నిజంగానే అన్ని కోట్లు పెట్టి గెలిచాడా? అన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. ఆ వీడియోను మీరూ చూడొచ్చు.
పవన్ కళ్యాణ్ అలా ప్రమాణం చేస్తే.. నేను ఇక జీవితంలో అతని పేరు ఎత్తను! @pawankalyan#PawanKalyan #JadaSravanKumar #AndhraPradesh #YSJaganTimes pic.twitter.com/aESfWMA1Fl
— YS Jagan Times (@YSJaganTimes) August 20, 2024