కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. సామాజిక మాధ్యమాలు వేదికగా ఈ దారుణాలపై ప్రశ్నిస్తున్న వారి సంఖ్య పెరగడంతో.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలకు హోంమంత్రి అనిత కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఒక సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై స్పందించారు.
చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని ధర్మబద్ధంగా అరెస్ట్ చేయండి అంటే మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ పోలీసులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. దేనికి మీనమేషాలు లెక్కిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. క్రిమినల్‌కు కులం, మతం ఉండదని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్.. ఎన్నిసార్లు పోలీసు అధికారులకు చెప్పాలని ప్రశ్నించారు. ఇటువంటి దారుణాలకు పాల్పడే వారిని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య ఎందుకు వస్తోందని అసహనాన్ని వ్యక్తం చేశారు. కులం ఎందుకు వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. మూడేళ్ల ఆడ బిడ్డను రేప్ చేసి చంపేస్తే కులం పేరుతో వెనకేసుకుని వస్తారా..? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏం మాట్లాడుతున్నారు మీరంటూ ప్రశ్నించిన పవన్ కల్యాణ్.. భారతీయ శిక్షాస్మృతి ఏం చెబుతోందంటూ ప్రశ్నించారు. క్రిమినల్స్‌కు వెనకేసుకుని రమ్మని చెబుతోందా.? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పవన్ తాను హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుందంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని, ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇవన్నీ టీడీపీ వాళ్లు చేస్తన్నారన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. టీడీపీ వాళ్లు చేస్తున్నారని చెప్పేందుకు చాలా కష్టపడినట్టు తనకు కనిపించిందని పేర్కొన్న అనిత.. క్రిమినల్ కులం, పార్టీ చూడడం లేదని వెల్లడించారు. క్రిమినల్ అనేవాడు క్రిమినల్ అని స్పష్టం చేసిన అనిత.. నాలుగు నెలలు కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కడ జరిగినా 28 గంటలు నుంచి మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం మహిళలు భద్రత విషయంలో చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకలా, హోంమంత్రి అనిత మరోలా స్పందించిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడండి.
డిప్యూటీ సీఎం ఒకలా
హోం మినిస్టర్ ఒకలా pic.twitter.com/1uEocg8Xpi— Anitha Reddy (@Anithareddyatp) November 4, 2024