టీడీపీలో ‘రఘురామ’ తిరుగుబాటు

టీడీపీలో ‘రఘురామ’ తిరుగుబాటు

Mauris mattis auctor cursus. Phasellus tellus tellus, imperdiet ut imperdiet eu, iaculis a sem. Donec vehicula luctus nunc in laoreet. Aliquam erat volutpat. Suspendisse vulputate porttitor condimentum.

Jellywp

ఏపీలో రఘురామకృష్ణంరాజు పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి వైసీపీ ప్రభుత్వంలో స్వపక్షంలో విపక్షంగా మారి ఆయన విసిరిన సైటర్లు, అధినేత జగన్ పై చేసిన పోరాటం, అందులో పోలీసు కస్డడీలో హింస, కోర్టు కేసులు ఇవే. ఇప్పుడు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన తన శైలిని మార్చుకోలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో ఆయన చేసిన వ్యాఖ్యల వల్లే.

సహజంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారనే పేరున్న రఘురామకృష్ణంరాజు తనకు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మంత్రి పదవి అన్ని కులాలకు ఇవ్వలేరు. చంద్రబాబు భయపడే కులాలు కొన్ని ఉంటాయి, నచ్చని కులాలు కూడా ఉండొచ్చు. భయపడే కులాలకు ఎక్కువ పదవులు ఇచ్చి నచ్చని కులాన్ని పక్కనబెట్టొచ్చని రఘురామ చెప్పుకొచ్చారు. బ్రాహ్మణ కులం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని, క్షత్రియ కులంలో ఆరేడుగురు ఎమ్మెల్యేలు గెలిచినా ఇవ్వలేదని రఘురామ ఆరోపించారు.

రఘురామ కామెంట్స్ పై ఇప్పుడు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రఘురామ గతంలోనూ వైసీపీ ప్రభుత్వంలో రెబెల్ గా ఉన్నారని కొందరు అంటుంటే.. మరికొందరు అంత తొందరెందుకని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా వైఖరి మాత్రం మారదని ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులు అయితే ఏకంగా సీఎం చంద్రబాబు తనకు నచ్చని కులాన్ని తొక్కేస్తారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తొలుత స్పీకర్ లేదా మంత్రి పదవి ఆశించిన ఆయన.. ఏదీ దక్కకపోవడంపై అసంతృప్తితోనే ఇలా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఏదేమైనా రఘురామ వ్యాఖ్యల వేడి ఇప్పుడు టీడీపీ అధిష్టానాన్ని తాకుతోంది.