వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగాను ఇరుకున పెట్టే కుట్రల సాగుతున్నాయా అంటే తాజా పరిణామాలను చూస్తుంటే అవునన్న సమాధానమే నిపుణుల నుంచి వినిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వివాదం అంశంపై చర్చ జరుగుతోంది. ఎల్లో మీడియా కావాలనే దీనిపై చర్చించేలా కుట్ర పన్నుతోంది. ఇక విషయంలోకి వెళితే వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించిన కొన్ని షేర్లను తన సోదరి అయిన షర్మిల, తల్లి విజయమ్మకు కొన్నాళ్ల కిందట ప్రేమతో అందించారు. జగన్మోహన్ రెడ్డి ఈ షేర్లును ఆస్తి పంపకంలో వాటాగా కాకుండా ప్రేమతో వారికి అందించారు. జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న ఆస్తుల్లో వాటాను ఆయన ఇచ్చారు. అయితే, ఇప్పుడు రద్దు చేసుకునేలా మేరకు ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. దీని వెనక అనేక కారణాలు ఉన్నాయి. అయితే, ఇక్కడే అసలు లాజిక్ ఉంది. జగన్ కు బిజినెస్ కు సంబంధించిన ఆస్తులన్నీ ఈడి, సిబిఐ అటాచ్ చేసి ఉన్నాయి. ఆయా ఆస్తులను వేరే వాళ్లకు బదిలీ చేయడం నిషేధం. ఒకవేళ బదిలీ చేస్తే అది నేరం అవుతుంది. వైయస్ విజయమ్మ, షర్మిలకు ఇచ్చినవి షేర్లు కూడా సిబిఐ, ఈడి అటాచ్ చేసిన ఆస్తులు జాబితాలోనే ఉన్నాయి. ఈ కేసులు విచారణ సాగుతున్నంత కాలం వాటిని విక్రయించేందుకు అవకాశం లేదు. విచారణ పూర్తి అయిన తర్వాత అమ్ముకునే అవకాశం ఉంది. అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రేమగా ఇచ్చిన ఈ షేర్లను నిశ్శబ్దంగా బదలాయింపు చేస్తున్న విషయం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వచ్చింది. కేసు విచారణలో ఉండగా ఇలా బదలాయింపు చేయడం నేరం కిందే వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించే ఉద్దేశంతో షర్మిల ఇలా చేస్తుందా అన్న అనుమానాలకు తావిస్తోంది ఈ ప్రక్రియ. ఇదే విషయాన్ని షర్మిలకు తెలియజేసి ఆ ప్రక్రియను నిలిపే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ అటు నుంచి సరైన స్పందన లేకపోయింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో కేసు వేసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సంబంధాలు బాగుండడంతో చెల్లిపై ప్రేమతో ఆయన షేర్లు ఇచ్చారు. ఇప్పుడు అదే చెల్లి తనపై ప్రతీకారంతో రగిలిపోయి నాశనాన్ని కోరుకుంటోంది. ఒకరకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి శత్రువులతో కలిసి ఆయన పై యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ షేర్లు ఆమె పేరుతో ఉంటే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేలా ఇటువంటి కుట్రలు పన్నే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీ ను ఆశ్రయించారు.
తనపై జరుగుతున్న కుట్రను ముందే గుర్తించి అప్రమత్తం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అయితే దీనిపై కల్పితాలను సృష్టిస్తూ సునకానందం పొందే ప్రయత్నం చేస్తుంది ఎల్లో మీడియా.
<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>తనపై పన్నిన కుట్రను పసిగట్టిన జగన్. <a href=”https://t.co/bD0mE9ryX7″>pic.twitter.com/bD0mE9ryX7</a></p>— Team Jagan Army | Siddham (@nenurajun) <a href=”https://twitter.com/nenurajun/status/1849070927922737366?ref_src=twsrc%5Etfw”>October 23, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>