మనకెందుకు యుద్ధం ‘పవర్ రేంజరన్న’

’వినేటోడు ఉంటే.. ఇంట్లో నుంచి విమానం యెళ్లింది’ అన్న చందంగా తయారైంది ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీరు. ఆయన చేసే పని అర్ధ రూపాయి అయితే.. చెప్పే మాటలు ఐదు వందల రూపాయలు అన్నట్టుగా ఉంటాయి. ఇ ప్పుడే అవే ఆయన్ను సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు గురి చేస్తున్నాయి. తాజాగా ఒక సమావేశంలో మాట్లాడిన డి ప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. స్వామి మీద ఆన మీకు యుద్ధమే కావాలంటే కోరినంత ఇస్తానంటూ వైసీపీ నాయకులను ఉద్ధేశించి పేర్కొన్నారు. ఈ మాటలకు వైసీపీ సోషల్‌ మీడియా గట్టిగానే కౌంటర్‌ ఇస్తోంది. గడిచిన కొద్ది రోజులు నుంచి సామాజిక మాధ్యమాల్లో కూటమి నాయకుల తీరును తూర్పు గోదావరి యాసతో తీవ్రస్థాయిలో ఎండ గడుతున్న ఒక యువకుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన యుద్ధాలు గురించి అలుపెరుగకుండా ఒక వీడియో చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో యువకుడు ఏమన్నాడంటే.. యుద్ధాన్ని ఇస్తానంటున్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పటి వరకు చేసిన యుద్ధాలెన్నో అంటూ వ్యాఖ్యానించాడు. 2014లో పార్టీ పెట్టి ప్రశ్నిస్తా, పోరాడతా అని అన్నోడు. రియాలిటీ తెలుసుకుని పీకేదేమీ లేక పక్క పార్టీలకు కొమ్ముకాశాడు. ఇదీ నీ రాజకీయ చరిత్రలో లిఖించబడిన తొలి యుద్ధం అంటూ పవన్‌ కల్యాణ్‌ను సదరు యువకుడు ఏకేశాడు. 2019 ఎన్నికల్లో నేనే తోపు.. దమ్ముంటే ఆపు, మనల్నెవడ్రా ఆపేది అనే నినాదంతో పోటీ చేసి రెండు చోట్ల డిపాజిట్లు రాక ఓడిపోయావు. కట్‌ చేస్తే నాలుగేళ్లు సినిమాలు చేసుకున్నావు. ఇది నవ్వు చేసిన రెండో యుద్ధం అంటూ సదరు యువకుడు పవన్‌ కల్యాణ్‌ను తూర్పారబట్టాడు. సొంత తల్లిని దూషించిన వాళ్ల కోసం, నిన్ను ప్రాణంగా ప్రేమించిన వారిని సంకరజాతి నా కొడుకులు అని తిట్టిన వారి కోసం అర్ధరాత్రి రోడ్లెక్కి ర్యాలీలు చేసి రచ్చ చేశావ్‌. అబ్బా ఇది భవిష్యత్‌లో పది తరాలు గొప్పగా చెప్పుకునే యుద్ధం చేశావ్‌ అన్నా అంటూ పవన్‌ కల్యాణ్‌ను సదరు యువకుడు ఎక్కి దిగేశాడు.

2024 ఎన్నికల్లో స్టేట్‌లో ఒకడు, సెంట్రల్‌లో ఒకడు చెయ్యందిస్తేగానీ సొంతంగా పోటీ చేసి గెలవలేని దుస్థితి మనదని, శ్రీవారి దర్శనానికి కాలినడకన పోయి 60 మెట్లు ఎక్కలేక ఆగకుండా అలసిపోయి ఆగినోడివి మనకెందుకు చెప్పన్న యుద్ధం అంటూ సదరు యువకుడు ఎండగట్టాడు. యుద్ధం చేయాల్సింది వైసీపీ వాళ్లతో కాదన్నా.. ఆడ బిడ్డల మాన, ప్రాణాలు హరిస్తున్న ఉన్మాదులతో అంటూ సదరు యువకుడు పవన్‌కు సూచించాడు. ఉన్మాదులను సరిగా శిక్షించని న్యాయ వ్యవస్థ మీద యుద్ధం చెయ్‌, నువ్వు ప్రజలకు ఇస్తానన్న హామీలను నెరవేర్చడానికి యుద్ధం చెయ్‌, రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో నడిపించడానికి యుద్ధం చెయ్‌.. ఇవన్నీ మానేసి స్టేజులెక్కి స్టేట్‌మెంట్లు ఇస్తే ఎలా అన్నా అంటూ యువకుడు ఏకిపారేశాడు. ఇంకా అపోజిషన్‌లో ఉన్నానని భ్రమపడుతున్నావా ఏందన్న అంటూ ప్రశ్నించిన యువకుడు.. నువ్వు స్టేజ్‌ ఎక్కి చెప్పిన డైలాగులకు జనం నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.