గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లపై కూటమి ప్రభుత్వం నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేలు వేతనం ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీనికి పవన్ కల్యాణ్ కూడా మద్ధతును తెలియజేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ హామీని కూటమి నాయకులు పూర్తిగా విస్మరించారు. వాలంటీర్లను అస్సలు పట్టించుకోవడమే మానేశారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు అస్సలు వ్యవస్థలోనే లేరంటూ పవన్ కల్యాణ్ మాట్లాడారు. దీనిపై వాలంటీర్ వాలేర్తు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేవారు. ’అందరికీ నమస్కారమండి. నేనండీ వాలంటీర్ వాలేరునండి.
అదేటీ పవర్ రేంజరు అన్నయ్య వాలంటీర్లను వ్యవస్థలో లేరు అంటారేంటి. మరి గత ఐదేళ్లు వ్యవస్థలో లేకుండా వాషింగ్టన్‌లో ఉన్నామా ఏటి. మన బాబోరు వ్యవస్థలో లేని వాలంటీర్లకు పది వేలు జీతాలు ఇస్తామని వాగ్ధానం ఎలా చేశారు. ఇత్తే ఇస్తామని చెప్పాలి. లేదంటూ లేదని చెప్పాలి. అంతేగానీ మైకొట్టుకుని మంగళవారం మాటలు చెప్పకూడదు అండి. పలవా బోరుకొట్టి బిర్యానీ కోసం బాబోరును నమ్మకున్నందుకు బాగానే బుద్ధి చెప్పారండి. మీరు అన్నట్టు మోసం చేసిన గత ప్రభుత్వం నుంచి నెలకు ఐదు వేలు చొప్పున ఐదేళ్లలో మూడు లక్షలు ముట్టాయండి. మరి మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది.
మూట గట్టి ఇచ్చిందేంటి. ప్రతిపక్షంలో ఉండగా వేలెత్తి చూపించి.. ఎన్నికలు దగ్గరపడేసరికి వెన్నపూస రాసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. మీ అలవాటు ప్రకారం వెన్నుపోటు పడొడుస్తావని. అయినా నిన్ను నమ్మాంగదా వుయ్ డిడ్ మిస్టేక్. మరి చేసిన దానికి అనుభవించక తప్పుద్దా. కానివ్వండి’ అంటూ వాలంటీరు వాల్తేరు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేనయ్య వాల్తేరు కూటమి నేతలు చెప్పే మాటలు, చేసే పనులకు పొంతన ఉండదు. ఇంకా ముందుంది ప్రజలకు పన్ను, వెన్ను పోట్టు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.