ముచ్చటగా మూడు నెలలు అంతే.. బాబు హనీమూన్ ముగిసింది. ఉద్యోగులకు మూడు నెలల పాటు తమది ‘మంచి ప్రభుత్వం’ అన్నసినిమా చూపించిన బాబు గారు.. ఇప్పుడు చేతులెత్తేసారు.ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇంకా జీతాలు పడకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు.
ప్రస్తుతం 5వ తేదీ వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు పడలేదు. కొందరికీ పడుతున్నాయి ఇప్పుడే.. శుక్రవారం నాటికి జీతాల చెల్లింపులు రూ.1500 కోట్లు పెండింగ్ లో ఉన్నట్టు చంద్రబాబు అనుంగ పత్రిక ఆంధ్రజ్యోతి తెలిపింది.
సాయంత్రం నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు బ్యాంకు ఖాతాల్లో వేతనాలు పడుతాయా? అని బ్యాంకులు, మొబైల్ పోన్ల చుట్టూ చూస్తున్నారు. కొందరికి పడి ఇంకొందరికీ వేయకపోవడంతో గందరగోళం నెలకొంది.
చంద్రబాబు వద్ద ఖాజానా ఖాళీ అయ్యింది. సంపద సృష్టిస్తానన్న పెద్దమనిషి ఏం సృష్టించకపోవడంతో దమ్మిడి ఆదాయం లేదు. దీంతో ఇప్పటికే సూపర్ 6 పథకాలకు మంగళం పాడిన చంద్రబాబు ఇప్పుడు కనీసం జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి దిగజారాడు.
ఎంతో గొప్పగా విజనరీ అన్న చంద్రబాబు కనీసం జీతాలు కూడా పండుగ నాడు ఇవ్వకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని.. చెడ్డ ప్రభుత్వం అని నినదిస్తున్నారు.
మూడు నెలల ముచ్చటగా 'ఒకటో తేదీనే జీతాల సొల్లు' pic.twitter.com/CPzK4jgUq1
— Inturi Ravi Kiran (@InturiKiran7) October 5, 2024