చంద్రబాబు 100 డేస్.. అట్టర్ ఫ్లాప్

vijayasaireddy

ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఘోరంగా విఫలమైనట్లు కనిపించిన చంద్రబాబు పనితీరు ఏంటి? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎందుకు పూర్తిగా విఫలమయ్యారు? అని ట్విట్టర్ ( X) లో కడిగిపారేశారు.

చంద్రబాబు 100 రోజుల పాలనను ఏకరువు పెట్టారు ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా. 100 రోజుల ఏపీ మేనేజ్‌మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్! అంటూ సోషల్ మీడియాలో నిలదీశారు.

‘‘ఏపీలో   100 రోజుల్లో వెయ్యి అడుగులు వేయాలన్న కూటమి సర్కార్ సందేశం బడుగు బలహీన వర్గాలను బాధించింది. ప్రభుత్వ పాలనపై రైతులు, యువత, మహిళలు, కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం ఎందుకు! కులాల ప్రాతిపదికన ఐపీఎస్, ఐఏఎస్‌ల బదిలీలు చేస్తున్నారని 40 ఏళ్ల పరిశ్రమకు చెందిన స్వయం ప్రకటిత చంద్ర బాబు ఎందుకు విమర్శించారు? అసంతృప్తితో రగిలిపోతున్న మహాకూటమి నేతలను పట్టించుకోవద్దు! ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా తట్టుకోలేకపోతున్నామన్న చంద్రబాబు హిట్ రేటు ఎంత? ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలోనే ఆరంభం! ప్రజలదే తుది నిర్ణయం!’’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.