AP Politics : ఏపీలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ భ్రష్టు పట్టిస్తోందన్న ఆవేదన ఆగ్రహం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని పలువురు ఐపీఎస్ లను రోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేసి అక్కడే కూర్చొని సాయంత్రం వెళ్లాలని ఆదేశించారు. ఈ కక్ష సాధింపు వ్యవహారాలపై ఐపీఎస్ లలో ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. అంతా ఐపీఎస్ లు దీనిపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని డిసైడ్ అయ్యారు.
ఇప్పుడు అది మరిచిపోకముందే క్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలను ఎదురిస్తున్న పోలీస్ అధికారులను ఉన్నతాధికారులు బెదరిస్తూ పచ్చ పార్టీ సేవలో తరిస్తున్నారు. స్టిక్ట్ పోలీస్ ఆఫీసర్లను ఎమ్మెల్యేలకు ఊడిగం చేయాలని.. లేకపోతే పోస్టింగ్ ఉండందంటూ బెదిరిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి సీఐ లక్ష్మీకాంత్ రెడ్డితో దగ్గరుండి క్షమాపణ చెప్పించిన ఉన్నాధికారులు వ్యవహారం పెను దుమారం రేపింది. అస్మిత్ రెడ్డికి అనుకూలంగా పనిచేయకుండా నీతిగా నిజాయితీగా వ్యవహరించిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యే చెప్పినట్టు చేయాలని లేదంటే పోస్ట్ ఉండదంటూ బెదిరించారు. దీంతో సీఐ తో ఏకంగా ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేయించి మరీ సారీ చెప్పించారు. అయినా టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బీరాలకు పోయి సీఐ సారీ చెబుతున్నా ససేమీరా అనడం వీడియోలో కనిపించింది.
ఇలా టీడీపీ హయాంలో ఏపీ పోలీసు వ్యవస్థకే ఘోర అవమానం జరిగిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
పోలీసు వ్యవస్థకే ఘోర అవమానం ఇది @APPOLICE100
తాడిపత్రి MLA అస్మిత్ రెడ్డికి CI లక్ష్మీకాంత్ రెడ్డితో దగ్గరుండి క్షమాపణ చెప్పించిన ఉన్నాధికారులు pic.twitter.com/9HvSZGvkwo
— 𝐘𝐒𝐉 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@2029YSJ) August 28, 2024