AP Floods : సాధారణంగా మహానగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటో, బస్సు, కారులో చార్జీలు చెల్లించి వెళతాం.. కానీ వరుణ దేవుడి ప్రతాపానికి.. పాలకుల నిర్లక్ష్యానికి ఏపీ నగరాలన్నీ వరదలో చిక్కుకుపోయాయి. దేవతల రాజధాని అమరావతి అయితే సముద్రాన్ని తలపిస్తోంది. అసలు అక్కడ నిర్మాణాలు ఎలా చేపట్టవచ్చో కూడా అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రపంచబ్యాంక్ నుంచి దాదాపు 15వేల కోట్లను అప్పు తీసుకొచ్చి మరీ అమరావతిపై పెట్టుబడులు పెడుతున్నాడు.
అయితే ఇప్పుడు వానలకు అమరావతి మునిగిపోయింది. మొత్తం సముద్రాన్ని తలపిస్తోంది. పక్కనే ఉన్న విజయవాడ కూడా మునిగింది. ఎప్పుడు బస్సులు, కార్లు, ఆటోలతో బిజీగా ఉండే విజయవాడలో ఇప్పుడు అవన్నీ మునిగిపోయాయి. అందుకే ఎటు వెళ్లాలన్నా బోట్లే దిక్కయ్యాయి.
సముద్రాల్లో, నదుల్లో ఉండే బోట్లు వరద పోటెత్తడంతో విజయవాడ నగరంలోకి వచ్చాయి. వాటి అద్దెలు వాచిపోయేలా ఉన్నాయి. విజయవాడ వరదల్లో బోటు దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది. రూ.1500 నుండి మొదలుపెడితే రూ.4000 వరకు బోట్ల యజమానులు వసూలు చేస్తున్నారు.
ఇప్పుడు విజయవాడ నగరంలోకి వచ్చిన బోట్లు, వాటి దందా వైరల్ అవుతోంది. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
విజయవాడ వరదల్లో బోటు దందా
రూ.1500 నుండి రూ.4000 వరకు వసూలు చేస్తున్న బోట్ల యజమానులు pic.twitter.com/E7UtLZG9si
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2024