Chandrababu – RK : ఆంధ్రజ్యోతి ఆర్కే బయటపెట్టిన ‘బాబు’ మనసులో మాట

Andhra Jyoti RK, Chandrababu

Chandrababu – RK : ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎంతో అలుసంటారు.. పబ్లిక్ సర్వెంట్లను పనోళ్లవలే చూస్తుంటారని ఆయనపై ఉన్న అభియోగాలు కోకొల్లలు. అందుకే ఉద్యోగులపై ఆయన నిత్యం చేసే వ్యాఖ్యలైనా.. చేతలైనా ఇబ్బంది పెట్టేవే. రాష్ట్ర విడిపోయిన తొలి ఐదేళ్లలో ఉద్యోగులు అదే భరించారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగులు ఎన్నిరకాల ఇబ్బందులు పడ్డారనేది స్వతహాగా వారే ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆ తరువాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాలన చూశారు.

జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ఉద్యోగుల పక్షాల నిలిచారు. అందుకే.. వారి బాగోగులు, వారి కుటుంబం బాగు కోసం అప్పుడే కొత్తగా పెన్షన్ స్కీమ్‌ కోసం రూపకల్పన చేశారు. మొన్న కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ ఆలోచన జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడే చేశారు. ఉద్యోగుల భవిష్యత్తును ముందే ఊహించి కొత్త పథకంతో వారందరినీ ఆదుకోవాలని చూశారు. ఉద్యోగుల సంతోషమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఉద్యోగి తీసుకుంటున్న బేసిక్ శాలరీలో మినిమం 50శాతం ఇచ్చేలా గ్యారంటీ స్కీమ్‌ పథకాన్ని తీసుకొచ్చారు. ఉద్యోగుల భద్రతే ధ్యేయంగా ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు.

కానీ.. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉద్యోగుల బాగోగుల కోసం గతంలోనూ ఎలాంటి పథకాలకు రూపకల్పన చేసిన దాఖలాలు లేవు. ఇది స్వయానా ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న మాటే. ఎంతసేపూ టార్గెట్లు.. అవినీతి అంటూ గొప్పాలు చెప్పే బాబు ఉద్యోగులకు భరోసా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉంది కదా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజన్ అంటూ ఉద్యోగులను రాత్రి పగలు తేడా లేకుండా వర్క్ చేయించే ఆయన.. ఉద్యోగుల ఫ్యామిలీలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు.

ఎంతో భవిష్యత్తుతో జగన్ ఉద్యోగుల భవిష్యత్ కోసం ఆలోచిస్తే.. చంద్రబాబు మాత్రం ఉద్యోగులపై దురుసు ప్రవర్తనతో వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు.. ఉద్యోగుల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతపైనా పలు వీడియోలు ట్రోల్స్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ఉద్యోగుల పట్ల ఆయనకున్న ఒపీనియన్ బయట పడింది. ఉద్యోగులను ‘ఆ నా కొడుకులు..’ అంటూ సంభోదిస్తూ మాట్లాడడం చూస్తుంటే ఉద్యోగుల ఫ్యూచర్ ఏంటో కూడా అర్థం అవుతోంది. జీతాల విషయంలోనూ ఆయన మాట్లాడిన తీరు ఉద్యోగుల్లో మరింత కోపాన్ని రాజేసింది.

ఐదేళ్ల జగన్ పాలన.. చంద్రబాబు పాలనను చూసిన ఉద్యోగులు ఇప్పుడు బేరీజు వేస్తున్నారు. ఆయన ఈయన పాలనకు ఉన్న తేడాలపై ఓపెన్‌గానే కామెంట్లు చేస్తున్నారు. ఉద్యోగుల భవిష్యత్ పరితపించే నేత జగన్‌మోహన్ రెడ్డి అని.. ఉద్యోగులను జీతగాలుగా వాడుకొని వదిలేసే రకం చంద్రబాబు అని విమర్శలు వస్తున్నాయి. ఎంతో ముందస్తు ఆలోచనతో గ్యారంటీ స్కీమ్‌‌‌కు పురుడు పోస్తే.. సరిగా ఇప్పుడు కేంద్రం కూడా అదే స్కీమ్‌ను అమల్లోకి తేవడం చూస్తుంటే జగన్ ఎంతటి భవిష్యత్ విజన్‌తో ఆలోచించరనేది అర్థం అవుతోంది.