ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కు నిత్యం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పని. జగన్ అధికారంలో ఉన్న లేకపోయినా ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకుని జర్నలిజం చేస్తుంటుంది ఆ సంస్థ యాజమాన్యం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయనపై విమర్శలతో కూడిన వార్తలను ప్రచారం చేస్తే ప్రజలు ఎంతో కొంత హర్షించే వాళ్ళు. ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టడం అనేది జర్నలిస్టుల సహజ శైలి. అందులో తప్పేమీ లేదు. అధికార పక్షాన్ని విమర్శించడం తప్పేమీ కాదు. కానీ, అధికారాన్ని కోల్పోయిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని, ప్రతిపక్షాలు కేంద్రంగా చేసుకొని జర్నలిజం చేయడం ముమ్మాటికీ తప్పే అవుతుంది. కానీ, ఈ విషయంలో ఏబీఎన్ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నట్టుగా భావిస్తూ తమ చానల్ లో డిబేట్లు పెట్టే ఏబీఎన్ ఛానల్.. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తిట్ల దండకాలను పూరిస్తోంది. జగన్ ను ఎవరైతే గట్టిగా తిడతారో అటువంటి వారికే ఏబీఎన్ ఛానల్ లో ఎనలిస్టులుగా అవకాశాలు లభిస్తుంటాయి. రోజువారి నిర్వహించే డిబేట్లకు హోస్ట్ గా వ్యవహరించే వెంకటకృష్ణ అటువంటి వారిని వెతికి తీసుకురావడంలో నిష్ణాతుడిగా పేరుగాంచారు. అయితే, అటువంటి వెంకటకృష్ణకే తాజాగా ఒక ఎనలిస్ట్ షాక్ ఇచ్చాడు. జగన్ ను తిట్టేందుకు తీసుకువచ్చిన ఒక ఎనలిస్ట్ ఏకంగా ఆయన జగన్ మోహన్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబునాయుడు పాలన అత్యంత దారుణంగా ఉందన్న రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలతో వెంకటకృష్ణ షాక్ తినాల్సి వచ్చింది.
రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే గత మే నెలలో ఉన్న వాతావరణం ప్రస్తుతం లేదంటూ ఆ ఎనలిస్టు ఖరాకండీగా చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డికి పాలనాపరమైన విధాన లోపాలతో మీరే కాల్ ఇస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆరు నెలల తర్వాత కాల్ వస్తే చేసేందుకు కూడా ఏమీ ఉండదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వెంకటకృష్ణను షాక్ కు గురి చేశాయి. ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు.
ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసేలా సదరు ఎనలిస్టు చేసిన వ్యాఖ్యలు విన్న వెంకటకృష్ణ.. అవును.. అవును అంటూ సైలెంట్ అయిపోవడం గమనార్హం. ఈ వ్యాఖ్యలను వెంకటకృష్ణ ఖండించే సాహసం కూడా చేయకపోవడాన్ని బట్టి చూస్తే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పట్ల ఏ స్థాయిలో వ్యతిరేకత రాజుకుంటుందో అర్థం చేసుకోవచ్చని సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను వైరల్ చేస్తున్న పలువురు పేర్కొంటున్నారు.
మీ దిక్కుమాలిన పాలనతో జగన్ గారికి మీరే కాల్ ఇస్తున్నారు.. ఆయన వచ్చిన తరవాత ఇక మీరు చేయగలిగేది కూడా ఏమీ ఉండదు pic.twitter.com/mQTmwZuZ6r
— Inturi Ravi Kiran (@InturiKiran7) October 19, 2024