రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిదే బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతోంది. ఇప్పటికీ ఆయన జగన్మోహన్‌రెడ్డిపై ఏడుపుగొట్టు మాటలు మాత్రం మానడం లేదు. పవన్ కల్యాణ్ ఏది మాట్లాడినా తలా, తోకా ఎలా ఉండదో.. అందులో నిజాలు కూడా అస్సలే ఉండవు. ఈ విషయం రాష్ట్రంలోని ప్రజలకే కాదు.. ఆయన అభిమానులకు కూడా తెలుసు. తాజాగా ఆయన నోటి నుంచి జాలువారినా ముత్యాల్లో కొన్నింటిని చూస్తున్న ఎంతో మంది నవ్వుకుంటున్నారు. ఓరేయ్ ఆయనకు ఎవడైనా చెప్పండిరా ఈ రాష్ట్రానికి సీఎంగా చంబ్రాబు, డిప్యూటీ సీఎంగా ఆయనే ఉన్నాడని అంటూ సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేసుకుంటున్నారు.
ఇంతకీ విషయానికి వస్తే.. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా వ్యాప్తి చెంది సుమారు 16 మంది మృతి చెందారు. తాగునీటి కలుషితంతో గడిచిన వారం రోజుల్లో వీరంతా మృతి చెందారు. వీరిని పరామర్శించేందుకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంరతం మీడియాతో మాట్లాడిన ఆయన డయేరియా వ్యాప్తికి బాధ్యత మాజీ సీఎం జగన్‌దే అన్నట్టు మాట్లాడారు. డయేరియా వ్యాప్తికి కారణం పరిశీలిస్తే గత వైసీపీ ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ మార్చకపోవడం వల్లే ఈ సమస్య వచ్చినట్టు పేర్కొన్నారు. పనిలో పనిగా గత వైసీపీ ప్రభుత్వం ముందు చూపుతో నిర్మించిన రుషికొండ భవనంపైనా ఆయన ఏడుపును వెళ్లగక్కారు. రుషికొండ లాంటి భవనాలకు ఖర్చు చేసేందుకు నిధులు ఉన్నాయి గానీ.. ప్రజలకు అవసరమైన ఇటువంటి పనులు చేసేందుకు నిధులు వెచ్చించలేదన్నట్టుగా ఆయన మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలు చూసిన ఎంతో మంది.. వేయి కోట్లు వరకు వెచ్చించి ఉద్ధానంలో కట్టి కిడ్నీ రీసెర్చ్ సెంటర్, తాగునీటి సరఫరా ప్రాజెక్ట్‌ను మర్చిపోయారా..? పవన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కట్టిన మెడికల్ కాలేజీలను చూసైనా మారండి అంటూ పలువురు హితబోధ చేస్తుండగా.. మరికొంత మంది పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా తాగునీటి సరఫరా విషయంలో ఏపీ ప్రభుత్వానికి గతంలో కేంద్రం ప్రకటించిన ర్యాంకులను గుర్తు చేస్తున్నారు. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి సరఫరాలో ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని కేంద్రం గతంలో కితాబిచ్చింది. గ్రామీణ ప్రజలకు అందించే తాగునీటికి రెండుసార్లు నాణ్యత పరీక్షలు చేయడంతోపాటు కలుషితంగా తేలిన చోట్ల చేసిన ప్రత్నామ్నాయ ఏర్పాట్లను గుర్తించి కేంద్రం ర్యాంకులను కేటాయించింది.
ఈ చర్యలను గుర్తించిన కేంద్ర జలశక్తి శాఖ ఏపీకి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును కేటాయించింది. ఇవేమీ తెలియకుండా పవన్ కల్యాణ్ ఇప్పటికీ గత ప్రభుత్వంపై బుదరజల్లేలా వ్యాఖ్యానించడం పట్ల పలువురు నవ్వుకుంటున్నారు. ఇప్పటికీ జగనే సీఎం అన్న భావనలో పవన్ కల్యాణ్ ఉండడం వల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://x.com/JaganannaCNCTS/status/1848710908119552514