బాబు గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు.. ఇచ్చిన హామీలకు అసలు పొంతనే లేదని కామన్ మ్యాన్ కాంతారావు బయటకొచ్చి చీల్చిచెండాడాడు. గోదావరి యాసలో పాపులర్ అయిన ఓ యువకుడు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కల బొక్కలను బయటపెట్టాడు.
చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రకారం.. అసలు కేటాయించిన బడ్జెట్ ఏమూలకు సరిపోదని కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీలో బడికి వెళ్లే విద్యార్థులకు 15వేలు ఇస్తానని బాబు ఎన్నికల్లో హామీనిచ్చారు. దీనికోసం బడ్జెట్ లో అయ్యే ఖర్చు 12600 కోట్లు. కానీ చంద్రబాబు ప్రభుత్వం దీనికోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం 5387 కోట్లు మాత్రమే. మరి మిగతా లెక్క ఎక్కడా అని ప్రశ్నించాడు. అలాగే రైతు భరోసా కింద రైతులకు ఇవ్వాల్సిన డబ్బు 10వేల కోట్లు. కానీ బడ్జెట్ లో కేటాయించింది కేవలం 1000 కోట్లు. ఒక్కో కుటుంబానికి 3 సిలిండర్లు ఇవ్వాలంటే కోటిన్నర కుటుంబాలకు 4500 కోట్లు కావాలి. కానీ 895 కోట్లు మాత్రమే కేటాయించారు.
ఇక 18 ఏళ్లు దాటిన ఆడపిల్లలకు రూ.18వేలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి గురించి.. మహిళలకు ఉచిత బస్సు గురించి బడ్జెట్ లో ఊసే లేదు. బాబు గారి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వారంతా ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ‘అయిపాయే’ అంటూ నిట్టూరుస్తున్నారు.