ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ టిడిపీకి చెందిన హోంమంత్రి అనితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై కఠినంగా వ్యవహరించకపోతే తాను హోంశాఖ బాధ్యతలను చూడాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు వెనక ఉద్దేశం వేరే ఉంది అంటూ సామాజిక మాధ్యమాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి వెనుక కారణం అదే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆగ్రహానికి మూడు కారణాలు ఉన్నాయంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. అందులో మొదటిది టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు నియామకం. టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధితుల స్వీకరించి మూడు రోజులు గడుస్తున్న పవన్ కళ్యాణ్ ను కలవలేదు.
ఇది పవన్ కళ్యాణ్ ను ఆగ్రహానికి గురిచేసినట్లు చెబుతున్నారు. అలాగే టిటిడి బోర్డు సభ్యులుగా పవన్ కళ్యాణ్ 5 పేర్లను అందించారు. వీరిలో ముగ్గురికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కావాలనే మిగిలిన ఇద్దరుకు ఇవ్వలేదని ఆగ్రహం పవన్ కళ్యాణ్ లో ఉంది. అలాగే, అనేక నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలపై టిడిపి నేతలు దాడులకు దిగుతున్నారు. వీటిని సద్దుమణిగించేలా చేయాల్సిన టిడిపి అగ్ర నాయకులు పట్టించుకోవడం లేదు. అదే సమయంలో మద్యం, ఇసుకలో వాటాలు అందకపోవడంతో పవన్ కళ్యాణ్ ఈ తరహాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం జరుగుతుంది. దీనిపై అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి ఇవే కారణం అంటూ పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఏడుపు & బెదిరింపు కి 3 కారణాలు ..
1) టీటీడీ ఛైర్మన్ గా నియమితులైన బిఆర్ నాయుడు 3 రోజులుగా హైదరాబాద్ లో ఉన్నా పవన్ కళ్యాణ్ ని కలవకపోవడం
2 ) పవన్ టీటీడీ లో అడిగిన 5 స్థానాల్లో 3 మాత్రమే ఇవ్వడం & ఆంధ్రా నుండి పని చేసిన వారిని కావాలి అనే బాబు వారికి ఇవ్వకపోవడం
— Sridhar Reddy Avuthu (@SridharAvuthu) November 4, 2024