చంద్రబాబు అంటేనే ‘వెన్నుపోటు’కు బ్రాండ్ అంబాసిడర్ అని పేరుంది. సొంత పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారన్న అపవాదును మూటగట్టుకున్నాడు. ఎన్నికల్లో గెలవడానికి అలవికాని హామీలు ఇవ్వడం గెలిచాక మోసం చేయడం బాబుకు అలవాటు యేనని ఓ మహిళ తాజాగా మీడియా ముఖంగా విమర్శించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో ప్రతి మహిళకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆ హామీని అమలు చేసే విషయంలో దారుణంగా మోసం చేశాడు. “దీపం” పథకం కింద ఉన్న మహిళా లబ్ధిదారులకు మాత్రమే ఈ సదుపాయం అందిస్తామని తెలిపారు. దీపం పథకం అన్నది కేవలం కొందరు పేద కుటుంబాలకు మాత్రమే పరిమితమై ఉంటుందని మెలిక పెట్టడంతో ఏపీ మహిళలు మండిపడుతున్నారు.
ఈ పరిణామం వలన చాలామంది మహిళలు గ్యాస్ సబ్సిడీ పొందకుండా మోసపోయారని, ఎన్నికల హామీకి.. అమలుకు మధ్య వ్యత్యాసం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మీద ఈ విషయంలో ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ మహిళ చంద్రబాబు మోసం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దానికి ట్రోలర్స్ జోడించిన ఈ వీడియో కూటమి సర్కార్ ను నిలదీసేలా ఉంది.. మీరూ చూసి కామెంట్ చేయండి..
<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>ప్రతి మహిళకు ఫ్రీగా గ్యాస్ ఇస్తానని గ్యాస్ కొట్టి.. ఇప్పుడు దీపం పధకం వాళ్ళకే అని మాట మార్చిన గ్యాస్ మ్యాన్ <a href=”https://t.co/6Dc9Q2JPQ6″>pic.twitter.com/6Dc9Q2JPQ6</a></p>— Inturi Ravi Kiran (@InturiKiran7) <a href=”https://twitter.com/InturiKiran7/status/1850049453350322403?ref_src=twsrc%5Etfw”>October 26, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>