‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. సొచ్చేవి అవేవో గుడిసెలు అంటే ఇదే మరీ.. ’.. దేవుళ్లు అంటే లెక్కలేదు.. హారతులు ఎలా చేస్తారో తెలియదు.. ప్రారంభోత్సవాలను ఎలా చేస్తారో తెలియదు.. పైగా తమది సనాతన ధర్మం అని.. తిరుమల పరిరక్షకులం అంటూ చంద్రబాబు గారు తెగ ప్రచారం చేసుకుంటారు.
అమరావతి సమ్మిట్ పేరిట పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా చంద్రబాబు గారు మహా క్రతువు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని దీపారాధనతో చేయాల్సి ఉంటుంది. దీంతో అధికారులు బాబు గారికి క్యాండిల్ ఇచ్చి దీపారాధన అంటించమన్నారు.
బాబు కనీసం బూట్లు విప్పకుండా అలానే అంటించబోయారు. ఇదే జరిగితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి.. ఆ అపచారాన్ని అందరూ దుమ్మెత్తిపోసేవారే..
కానీ బాబు గారి పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ తెలివైన అధికారి వచ్చి బూట్లు తీసి ప్రారంభోత్సవాన్ని చేయండని చెవిలో చెప్పాడు. అప్పుడు జ్ఞానోదయం అయిన బాబు గారు పక్కకు వెళ్లి బూట్లు విప్పి అప్పుడు ఆ దీపారాదన చేశారు.
ఇలా దేవుళ్లు, దైవత్వం గురించి ఏమాత్రం అవగాహన లేని.. పూజించని చంద్రబాబు గారు సనాతన ధర్మం అంటూ.. తిరుమలలడ్డూ పవిత్రత గురించి చెప్పడం అంటూ చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడమేనని వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
బూట్లతో జ్యోతి వెలిగించకూడదని అధికారులు తో చెప్పించుకున్న చంద్రబాబు.
అధికారులు చెప్పడంతో బూట్లు తీసిన చంద్రబాబు. pic.twitter.com/b2mgfRVps8
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) October 22, 2024