‘గుడిలోని దేవుడిని కాలదన్నీ.. దారినపోయే దరిద్రాన్ని’ మెడలో వేసుకున్నామని ఇప్పుడు బాధపడుతున్నారు. జగన్ ను ఓడించి తప్పుచేశామన్న బాధ, ఆవేదన, ప్రశ్చాత్తాపం ప్రజల్లో కనిపిస్తోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఓటమిపాలైంది. ఎన్నికల్లో వైసిపి ఓటమికి అనేకమంది అనేక కారణాలు చెబుతుంటారు. అయితే జనాలు మాత్రం కొన్ని కారణాలు చెబుతున్నారు. ఆ కారణాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజున జగన్మోహన్ రెడ్డి ఒక మాటను బలంగా చెప్పారు. అదే కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, పార్టీ అంతకంటే చూడను అని చెప్పి సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇదే ఆయన చేసిన తొలి తప్పుగా పేర్కొంటున్నారు. ఒకే సంతకంతో వెయ్యి రూపాయలుగా ఉన్న పెన్షన్ ను రూ.2250 కు పెంచడంతోపాటు కోడి కూయక ముందే ప్రతి గడపకు తెచ్చి ఇచ్చేలా చేసి మరో తప్పు చేశాడు జగన్. సంక్షేమ పథకాల లబ్ధి అందక, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ ప్రజలు తిరిగి ఇబ్బందులు పడకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక్క సంతకంతో రెండు లక్షల 60 వేల మందికిపైగా వాలంటీర్లను నియమించి మరో తప్పు చేశాడు. సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సొంత ఇంటి కలను నిజం చేసే ఉద్దేశంతో సుమారు 30 లక్షల మందికి ఇంటి పట్టాలను అర్హులైన అందరికీ అందించి మరో తప్పు చేశాడు మాజీ సీఎం జగన్.
ఒక్క సంతకంతో దాదాపు లక్షల 30 వేల సచివాలయ ఉద్యోగాలను కల్పించి మరో తప్పు చేశాడు. అధికారాన్ని చేపట్టిన ఏడాదిలోనే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కల్లోలం చేసిన ఏమాత్రం భయపడకుండా విదేశాల నుంచి ప్రత్యేక విమానాలు ద్వారా కరోనా కిట్లు, మాస్కులు తెప్పించి, పరీక్షలు చేయించి, ఇంటికి పోషకాహారాన్ని అందించి మరో తప్పు చేశాడు జగన్. నాడు నేడు పథకంలో భాగంగా 52,000 ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని భావించి ఇంకో తప్పు చేశాడు. నీటి కాలుష్యంతో కిడ్నీ సమస్యలు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఏడు లక్షలు జనాభా కలిగిన 32 గ్రామాలకు ప్రజలకు మంచినీటిని సరఫరా చేసేందుకు రూ.750 కోట్లు పెట్టి ఉద్దానం ప్రాజెక్టును కట్టి మరో తప్పు చేశాడు జగన్. పేద, మధ్య తరగతి వాడికి అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.25 లక్షలకు పెంచడం ఆయన చేసిన మరో తప్పు. కష్టం వచ్చి రైతులు ఆత్మహత్య చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు పెట్టీ, రైతు బీమా అమలు చేసి రైతులను ఆదుకోవడం ఆయన చేసిన మరో తప్పు. వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారాన్ని అందించాలనుకోవడం ఆయన చేసిన మరో తప్పు. ప్రసవం అనంతరం తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా వారిని సురక్షితంగా ఇంటి వద్ద దించడంతోపాటు రూ.5 వేలు చేతిలో పెట్టి వారికి తానున్నానంటూ భరోసా కల్పించి ఆయన మరింత పెద్ద తప్పు చేశాడు. భూమి మీదకు రాని ప్రాణానికి కూడా డబ్బు ఖర్చు పెట్టిన నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా అది ఒక్క జగన్ మాత్రమే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే. పేద, మధ్య తరగతి వాళ్లంతా తన కుటుంబం అనుకోబట్టే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అమలు చేశాడు.
అందుకే జగన్ ఎన్నికల్లో ఓడిపోయాడు. జగన్ ఓడిపోయింది ఎన్నికల్లో కాదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించడానికి ఐదేళ్ల కాలాన్ని గెలుచుకోవడంలో జగన్ ఓడిపోయాడు. అంతేగాని మనిషిగా, అంతకుమించి మనసున్న మహారాజుగా ఆయన ఎప్పుడో గెలిచాడు. దానికి నిదర్శనం గత ఎన్నికల్లో వచ్చిన 40 శాతం ఓట్ షేర్. ఇంకా కొద్దో, గొప్పో మనుషుల్లో మానవత్వం ఉంది అని నిరూపించుకోవడానికి దొరికిన బెంచ్ మార్క్ ఈ ఓట్ షేర్ మాత్రమే. ఇదీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమికి కారణాలుగా చెబుతూ ట్రెండ్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు చెప్పిన మాటలు. నిజంగా ఇది నిజమనే చెప్పాలి. అక్షర సత్యమైన ఈ మాటలు గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కార్యరూపం దాల్చి చూపించడం వల్లే జగన్ ఓటమిపాలైనట్లు అంగీకరించక తప్పని పరిస్థితి. ఓటమి అనంతరం నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. జనాలకు మంచి చేశాం.. ఓడిపోయాం. అంతేకానీ మోసం చేయలేదు అని అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలతో చెబుతున్న మాటలనే ఒక యువకుడు వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లోకి వదిలాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
జగన్ ఎందుకు ఓడిపోయాడు..?#AndhraPradesh #YSRCP pic.twitter.com/c8KORHtetY
— Team YSJMR (@TeamYSJMR) October 19, 2024