అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు కుటుంబంపై కొత్తగా ఏపీలో కొలువైన మంత్రుల్లో భయంతో కూడిన సిగ్గు వల్ల వచ్చిన గౌరవం ఎక్కువైపోయింది. తమ పొజిషన్ ఎమ్మెల్యే కంటే ఎక్కువ అయినా.. రాష్ట్రానికి హోంమంత్రి అయినా అనిత తాజాగా ఒక సాధారణ టీడీపీ ఎమ్మెల్యే కం నటుడు బాలకృష్ణ కాళ్లు మొక్కడం సంచలనమైంది.
ఏపీ హోంమంత్రి వనిత, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (బాలయ్య) కాళ్లు మొక్కిన ఘటన పార్టీ శ్రేణులను నివ్వెరపరిచింది.. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. సాధారణంగా రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు పెద్దగా వివాదానికి గురవుతాయి, ఎందుకంటే ప్రజా ప్రతినిధులు అధికారపదవుల్లో ఉండి మరెవరి పట్ల అలా చేయడం ప్రజల్లో ప్రశ్నలు లేవనెత్తుతుంది.
ఈ సంఘటనలో హోంమంత్రి అనిత ఏదో కార్యక్రమానికి వచ్చిన నందమూరి బాలకృష్ణ పట్ల భక్తిభావంతో అలా చేసినా, ప్రజల్లో ఇది కొంత వివాదాస్పదమైంది. రాజకీయ నేతలు, ముఖ్యంగా ఉన్నతాధికారులు, ఇలా చేయడం ప్రజలలో నైతికతకు సంబంధించిన చర్చలకు దారి తీస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనిత సహా టీడీపీ నేతలు కక్కలేక మింగలేక ఇబ్బందిపడుతున్నారు. ఇలా ఏపీ హోంమంత్రి కాళ్లు మొక్కడం తప్పు అని దుమ్మెత్తిపోస్తున్నారు.
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి.. కడుపయినా చేయాలన్న బాలకృష్ణ కాళ్లకు మొక్కిన హోం మంత్రి అనిత pic.twitter.com/RjGUhsdDi4
— Inturi Ravi Kiran (@InturiKiran7) October 18, 2024