చంద్రబాబు ఇళ్లు మునగకుండా ఉండేందుకే బుడమేరు నీటిని వదిలారని.. దానివల్ల విజయవాడ నీటి మునిగిందని సంచలన ఆరోపణలు చేశాడు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్. అంతేకాదు.. దాని వెనుక ఉన్న గుట్టును తాజాగా బయటపెట్టి సంచలనం రేపారు.
చంద్రబాబు ఇల్లు మునిగిందని ప్రకాషం బ్యారేజీ మూసేశారని.. అక్కడి నుంచి చూస్తే చంద్రబాబు ఇల్లు కనిపిస్తుందని.. అందుకే ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా ఇలా చేశారని జడ శ్రావణ్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇల్లు మునిగిందని విలేకరుల ముందే దబాయించాడని.. ఈనాడు, జ్యోతిలు అస్సలు దీన్ని ఒప్పుకోలేదన్నారు.
1000 ఇసుక బస్తాలు వేసి చంద్రబాబు ఇంట్లోకి కృష్ణా నీరు రాకుండా మళ్లించారని.. చంద్రబాబు ఇల్లు మునిగితే జాతీయ స్థాయిలో వార్త అవుతుందనే దాన్ని మునగకుండా ఇంత పనిచేశారని.. ఈ ఫొటోలు రాకుండా జాగ్రత్త పడ్డారని జడ శ్రావణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాషం బ్యారేజీ నుంచి వెళుతుంటే చంద్రబాబు ఇల్లు కనపడుతుందనే రాకపోకలు మూసేశారని.. చంద్రబాబు అక్రమ కట్టడంలో బాబు ఉంటున్నాడని.. ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో ఉన్న అక్రమమని ప్రచారం చేస్తారని దాచేశారని జడ శ్రావణ్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి అక్రమ కట్టడాన్ని రక్షించడానికి ఇదంతా చేశారని జడ శ్రావణ్ ఆరోపించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతుంది.
బుడమేరు దగ్గర వదిలేసి.. కరకట్ట అక్రమ కొంపకు రక్షణగా 1000 ఇసుక బస్తాలు వేశారు..!! pic.twitter.com/0Bdowrg0sv
— Inturi Ravi Kiran (@InturiKiran7) September 9, 2024