Nimmala Rama Naidu : నిమ్మల రామానాయుడు.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊరు వాడ కలియతిరిగాడు. గుడిసెల్లో దూరి వారికి అన్నం వండిపెట్టాడు. చంటిపిల్లల ముడ్డి కడిగి ఓట్లు అడిగాడు.. మహిళలు, యువతులు కనిపిస్తే ‘మీకు 15 వేలు.. మీకు 18 వేలు ’ అంటూ ఆఫర్ ఇచ్చి మొత్తానికి టీడీపీకి ఓట్లు పడేలా చేసి గెలిచి ఏకంగా మంత్రి అయ్యాడు.
అయితే నిమ్మల కేవలం ప్రజలను మాత్రమే కాదు.. వైసీపీ కోసం పనిచేస్తూ ప్రాణమిచ్చిన వాలంటీర్లను కూడా మేనేజ్ చేసిన వీడియో తాజాగా బయటకొచ్చింది.
రామానాయుడు అనే వలంటీర్ వైసీపీ కోసం పనిచేస్తూ నిమ్మల ప్రచారానికి వస్తే దూరంగా ఉన్నాడు. అయినా సరే ‘ఓరేయ్ రామానాయుడు అంటూ అతడి దగ్గరకు వెళ్లి మేనేజ్ చేశాడు. కూటమి ప్రభుత్వం వస్తే మిమ్మల్ని తీసివేయం.. అలాగే ఉంచుతాం.. మీకు 10000 మీకు10000 మీకు 10000 అని చెప్పి నమ్మించాడు. టీడీపీకి పనిచేయాలని.. నీకు భవిష్యత్ ఇస్తానంటూ ఆశచూపాడు..’
కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే వలంటీర్లకు ప్రభుత్వం ఎగనామం పెట్టేసారు. అప్పుడు నమ్మించి వాలంటీర్లను వైసీపీకి దూరం చేయించి టీడీపీకి ఓటు వేయించేలా చేసి ఇప్పుడు దారుణంగా మోసం చేసేశారు. నిమ్మల నమ్మించి గొంతుకోసిన ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఒరేయ్ రామానాయుడు లాస్ట్ కి వాలంటీర్లకు కూడా వదిలిపెట్టలేదా 😂
వాలంటీర్ దగ్గరికి వెళ్లి మీకు 10000 మీకు10000 మీకు 10000 అని చెప్పి ఎగనామం పెట్టేసారు కదా 😂 pic.twitter.com/jV5a17nULZ
— Hariswar Reddy (@hariswar_Reddy_) August 5, 2024