Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎంతో విష ప్రచారం.. పవన్ కళ్యాణ్ అయితే వైసీపీపై, జగన్ పై బట్టలిప్పి నడిరోడ్డుపై భరతనాట్యం చేశాడు. ఆంద్రప్రదేశ్ లో 30వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని.. వాలంటీర్లు ఇందులో సూత్రధారులు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన విష ప్రచారం అంతా ఇంతాకాదు. అయితే ఇప్పుడు కేంద్ర పార్లమెంట్ లోనే పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం ఎంత తప్పునో ఏకంగా వీరి కూటమి కేంద్ర ప్రభుత్వమే కుండబద్దలు కొట్టింది. పవన్ కళ్యాన్ కు గట్టి షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాం 2019-23 మధ్య అదృశ్యమైన మహిళల వివరాలను తెలుపాలని తాజాగా పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి, లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నించారు. వీరంతా కూటమి ప్రభుత్వంలోని వారే.. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొని గెలిచిన వారే.. వీరు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ మేరకు ఏపీలో మిస్సింగ్ కేసుల వివరాలను బయటపెట్టారు. అదే ఇప్పుడు ఏపీలో పెను సంచలనమైంది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో అదృశ్యమైన 44,685 మంది మహిళల్లో 44,022 మందిని పోలీసులు వెతికి పట్టుకున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ లో ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీస్ శాఖకు సహాయపడిందని పార్లమెంట్ లో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ మేరకు సంవత్సరాల వారీగా వివరాలను వివరించారు.
ఎన్నికలకు ముందు వైసీపీ పాలనలో 30వేల మంది ఏపీ మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని ఇదే పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేశాడు. ఇప్పుడు ఆయనే డిప్యూటీ సీఎం . వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు. కానీ సైలెంట్ అయ్యారు. వైసీపీని అనవసరంగా బ్లేమ్ చేసి అధికారం సంపాదించారు. రాజకీయ లబ్ధి కోసం విష ప్రచారం చేశారు. ఈ మేరకు ఇప్పటికే కేఏ పాల్ లాంటి వారు పవన్ ను ప్రశ్నించారు కూడా.. అధికారం కోసం దారుణంగా వైసీపీపై ఇలా దమనకాండ చేసిన పవన్ పై అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు.