చాదస్తం.. ఫస్ట్రేషన్.. ఏం చేయాలో తెలియని అయోమయం.. ‘నీకు 15 వేలు.. నీకు 18 వేలు అంటూ ’ మహిళలందరికీ వేలకు వేలు ఇస్తామన్న టీడీపీ బ్యాచ్, చంద్రబాబు ఇప్పుడు నిధులు లేక పిల్లిమొగ్గలు వేస్తున్నారు.ఏం చేయాలో తెలియక.. డబ్బులు లేక శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. జగన్ అప్పులు చేశాడు.. డబ్బులు ఇవ్వలేను అంటూ పెడబొబ్బలు పెడుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలను పిచ్చిపత్రాలుగా, వ్యర్ధ పత్రాలుగా మార్చేశారా అన్న అభిప్రాయం కలుగుతోంది. అయినదానికి, కానిదానికి శ్వేతపత్రాలు ఇవ్వడం ద్వారా వాటి విలువను ఆయనే పొగొట్టారనిపిస్తుంది.
ఏవైనా ప్రధాన అంశాలపై వైట్ పేపర్స్ ఇవ్వడం సాధారణంగా జరుగుతుంటుంది. అంతే తప్ప-ప్రతి చిల్లర విషయానికి ఉన్నవి, లేనివి కలిపి కాకి లెక్కలతో పత్రాలు ఇస్తే అది వృధా ప్రయాసే అవుతుంది. వాటి సీరియస్ నెస్ కూడా పోతుంది. ప్రస్తుతం ప్రభుత్వంలో తాము ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో అర్దంకాక, ఎలా ప్రజలను మభ్య పెట్టాలా అన్నదానిపై ఎడతెగని ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో ఈ శ్వేతపత్రాలను ముందుకు తీసుకు వచ్చారనిపిస్తుంది. చంద్రబాబుకు ఇది బాగా పాత అలవాటు.
1994లో ఈయన ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉండేవారు. అప్పుడు కూడా రెవెన్యూ, ఫైనాన్స్ శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ ఇచ్చారు. తదుపరి ఎన్టీఆర్ను పడదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల వాగ్దానాలను ఎగవేయడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ తంతును సాగించారు. ఆ తర్వాత మద్య నిషేధం ఎత్తివేశారు. రేషన్ బియ్యం రేటు పెంచారు. 2004 ఎన్నికలకు ముందు కూడా వాస్తవ పత్రాలు అంటూ ప్రభుత్వ ప్రచార పత్రాలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ది చేసింది చెప్పడానికి ఆయన ఆ పత్రాలు ఇచ్చారు. కాని జనం వాటిని నమ్మలేదు.. టీడీపీని ఓడించారు.
ఇప్పుడు కూడా జగన్ పై నెపం నెట్టేసి డబ్బులు లేవని చూపిస్తూ ఏపీ ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు.శ్వేతపత్రాల పేరిట కాలయాపన చేస్తు్నారు. ‘పిచ్చండీ ఇదీ’ అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు.